Barrelakka-RGV: పవన్ కంటే బర్రెలక్క బెటర్ అంట.. మళ్లీ ఆర్జీవీ బరెస్ట్!

తెలంగాణ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ అనుసరిస్తున్న తీరును వర్మ తప్పుపట్టారు. ఈ ఎన్నికల్లో సెంట్రర్‌ ఆఫ్‌ ది ఎట్రాక్షన్‌గా మారిన బర్రెలక్క అలియాస్‌ శిరీషతో పోలుస్తూ .. తన జనసేన అధినేతపై మాటల తూటాలను వదిలారు.

Written By: Raj Shekar, Updated On : November 27, 2023 1:42 pm
Follow us on

Barrelakka-RGV: వివాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. మెగా ఫ్యామిటీని ఆర్టీవీ కొన్నేళ్లుగా టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మెగా కుటుంబంపై ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసుకుని సోషల్‌ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టులు పెడుతూ వస్తున్నారు. పరోక్షంగా వైసీపీకి సహకరించేలా పోస్టులు ఉండేలా చూసుకుంటున్నారు. అధికారికంగా వైసీపీలో చేరకునా.. కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తకన్నా ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. తాజాగా మరోమారు జనసేనాని లక్ష్యంగా విమర్శలకు దిగారు. తెలంగాణ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ అనుసరిస్తున్న తీరును వర్మ తప్పుపట్టారు. ఈ ఎన్నికల్లో సెంట్రర్‌ ఆఫ్‌ ది ఎట్రాక్షన్‌గా మారిన బర్రెలక్క అలియాస్‌ శిరీషతో పోలుస్తూ .. తన జనసేన అధినేతపై మాటల తూటాలను వదిలారు.

సోషల్‌ మీడియాలో హైప్‌ కోసమే..
పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. పవన్‌ కల్యాణ్‌తో పోలిస్తే బర్రెలక్క చాలా బెటర్‌ అని రామ్‌ గోపాల్‌ వ్యాఖ్యనించారు. ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో బర్రెలక్కను చూసి నేర్చుకోవాలని పవన్‌ కల్యాణ్‌కు వర్మ సూచించారు. పవన్‌ తాను మాట్లాడుతున్న మైక్‌ పని చేస్తుందో లేదో చూసుకోకుండానే మాట్లాడటం దీనికి నిదర్శనమని వర్మ ఓ ట్వీట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో హైప్‌ కోసం, ఏపీ అధికార పార్టీ వైసీపీ మెప్పు పొందడం కోసమే ఇలాంటి పోస్టులు చేస్తున్నట్లు అర్థమవుతోంది.

అభ్యర్థులకు ఇష్టం లేదని..
ఆయన ఇక్కడితో ఆగకుండా… పవన్‌ ప్రచారానికి రావడం అభ్యర్ధలకు ఏమాత్రం ఇష్టం లేదేమో అనిపిస్తుంది..ఆయన మాట్లాడుతున్న మైక్‌ సౌండ్‌ రావడం లేదని తెలిసినప్పటికీ కూడా అక్కడున్న వారు ఈ విషయాన్ని పవన్‌కు తెలియజేయలేదంటూ వర్మ కామెంట్‌ చేశాడు. పవన్‌ కల్యాణ్‌పై వర్మ చేసిన కామెంట్స్‌పై జనసైన, బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అడల్ట్‌ కంటెంట్‌ సినిమాలు చేసే రామ్‌ గోపాల్‌ వర్మ పవన్‌ గురించి విమర్శలు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.