Hyundai: రికార్డు అమ్మకాలు సొంతం చేసుకున్న హ్యుందాయ్..

భారత ఆటోమోబైల్ మార్కెట్లో హ్యందాయ్ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ కంపెనీ భారత్ భూభాగానికి వచ్చి 27 ఏళ్లు అవుతోంది. మొదట్లో శాంత్రోను విడుదల చేసి వినియోగదారులను తనవైపునకు తిప్పుకుంది.

Written By: Chai Muchhata, Updated On : November 27, 2023 1:23 pm
Follow us on

Hyundai: కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కంపెనీలు పోటీ పడి ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తకొత్త మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ దేశీయ మార్కెట్లో అనేక మోడళ్ను ప్రవేశపెట్టింది. గత జూలైలో వినియోగదారులను ఆకర్షించేందుకు Exterను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ మోడల్ వచ్చీరాగానే అమ్మకాల్లో దూసుకుపోతుంది. నాలుగు నెలల్లో రికార్డు విక్రయాలు జరుపుకొని ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా 5 సీటర్ కారు కోసం వినియోగదారులు ఎగబడుతున్నాయి. ఈ ఏడాది ముగిసే నాటికి 6 లక్షల విక్రయాలు జరుపుకుంటాయని అంటున్నారు. ఇంతకీ ఆ కారు వివరాల్లోకి వెళితే..

భారత ఆటోమోబైల్ మార్కెట్లో హ్యందాయ్ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ కంపెనీ భారత్ భూభాగానికి వచ్చి 27 ఏళ్లు అవుతోంది. మొదట్లో శాంత్రోను విడుదల చేసి వినియోగదారులను తనవైపునకు తిప్పుకుంది. ఆ తరువాత ఎస్ యూవీల ఉత్పత్తులపై ఫోకస్ పెట్టింది. పవర్ ప్లే కార్లతో పాటు కొత్త కొత్త డిజైన్లతో కూడిన కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో 2019లో హ్యుందాయ్ నుంచి రిలీజ్ అయినా వెన్యూ మంచి గుర్తింపు సాధించింది. ఆ సంవత్సరంలో ఎక్కువగా అమ్ముడు పోయిన మోడల్ గా నిలిచింది.

అప్పటి నుంచి హ్యుందాయ్ కార్లపై నమ్మకం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో ఎక్స్ టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్ టర్ విషయానికొస్తే 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 82 బీహెచ్ పీ పవర్ తో పాటు 95 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏంఎంటీ గేర్ బాక్స్ తో ఈ మోడల్ ఆకర్షిస్తోంది. ఇక మైలేజ్ కోసం సీఎన్ జీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు 6 ఎయిర్ బ్యాగ్స్, డ్యూయల్ వ్యూ డాస్ కెమెరా, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూప్ ఆకర్షిస్తున్నాయి.

హ్యుందాయ ఎక్స్ టర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సమయంలో రూ.6 లక్షల ఎక్స్ షోరూం ధరను నిర్ణయించారు. మిగతా మోడళ్ల కంటే దీని ఫీచర్స్ ఆకర్షించడంతో పాటు ధర కూడా తక్కువగా ఉండడంతో వినియోగదారులు ఈ మోడల్ కోసం ఎగబడుతున్నారు.ప్రధానంగా సిటీ పీపుల్స్ ఎక్కువగా ఎక్స్ టర్ ను బుక్ చేసుకుంటున్నారు. స్టైలిష్ డిజైన్ తో పాటు కన్వినెంట్ డ్రైవింగ్ ఉండడంతో దీనిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు.