https://oktelugu.com/

‘దళిత బంధు’కు కౌంటర్ గా ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్’..

తెలంగాణ ప్రజానీకంతో పాటు ఏపీ రాజకీయ నాయకులను సైతం హుజూరాబాద్ నియోజవర్గం ప్రభావితం చేస్తోంది. ఇక్కడ నియోజకవర్గం నుంచి మంత్రిగా పనిచేసి ఈటల రాజేందర్ కు ఉన్న బలాన్ని పోగొట్టేందుకు అధికార టీఆర్ఎస్ ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ఈ స్థానాన్ని చేజారనీయకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘దళిత బంధు’ పథకాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సైతం హుజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 26, 2021 / 09:22 AM IST
    Follow us on

    తెలంగాణ ప్రజానీకంతో పాటు ఏపీ రాజకీయ నాయకులను సైతం హుజూరాబాద్ నియోజవర్గం ప్రభావితం చేస్తోంది. ఇక్కడ నియోజకవర్గం నుంచి మంత్రిగా పనిచేసి ఈటల రాజేందర్ కు ఉన్న బలాన్ని పోగొట్టేందుకు అధికార టీఆర్ఎస్ ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ఈ స్థానాన్ని చేజారనీయకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘దళిత బంధు’ పథకాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సైతం హుజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంగా రాజకీయ సమీకరణగా సాగిస్తున్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా నేతలంతా ఈటల రాజేందర్ తో కలిసి పాదయాత్రలోపాల్గొంటున్నారు. కేంద్ర పెద్దలు కూడా వస్తారని ప్రచారం చేస్తున్నారు. నియోజవర్గంలోని దళితులంతా తన వెంటే ఉన్నారని ఈటల రాజేందర్ ధీమాతో ఉన్నారు. అయితే ఎన్నికల ముందే ఈ పథకం డబ్బులు వారి ఖాతాల్లో పడితే మాత్రం తనకు దూరమవుతారనే ఆందోళనతో కూడా ఉన్నారు.

    మరోవైపు కొత్తగా నియామకమైన కాంగ్రెస్ పాలకవర్గం సైతం హుజూరాబాద్ నియోజకవర్గంలో తమ ప్రతాపాన్ని చూపాలని చూస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన దళిత, గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ దళిత, గిరిజనులను ఆకట్టుకోవడానికి పాత స్కీంతో వెళ్లాలని చూస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్’తో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది.

    హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా నియామకం అయిన దామోదర రాజనర్సింహ ద్వారా ఈ పథకం గురించి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్’ ద్వారా దళిత, గిరిజనుల ఖాతాల్లోకి నేరుగా నిధులు వెళ్లాయి. దీంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పథకానికి ప్రాధాన్యం ఇస్తామని ప్రచారం చేయనున్నారు. రిజల్ట్ పాజిటివ్ గా వస్తే దామోదన రాజనర్సింహనే అభ్యర్థిగా ప్రకటించి రంగంలోకి దించనున్నారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్’ ఎంత మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.