ఈ నగదు లావాదేవీలు జరిపితే ఐటీ నోటీసులు.. జాగ్రత్త!

దేశంలో డిజిటల్ లావాదేవీలు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వివిధ పెట్టుబడి ఫ్లాట్ ఫామ్ లు ప్రజలు నగదు లావాదేవీలను తగ్గించాలనే ఆలోచనతో ఇప్పటికే నిబంధనలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. నగదు లావాదేవీలకు నిర్దిష్ట పరిమితులు ఉండగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సేవింగ్స్ అకౌంట్ లో లక్ష రూపాయలకు మించి నగదు జమ అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే […]

Written By: Kusuma Aggunna, Updated On : July 26, 2021 9:17 am
Follow us on

దేశంలో డిజిటల్ లావాదేవీలు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వివిధ పెట్టుబడి ఫ్లాట్ ఫామ్ లు ప్రజలు నగదు లావాదేవీలను తగ్గించాలనే ఆలోచనతో ఇప్పటికే నిబంధనలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. నగదు లావాదేవీలకు నిర్దిష్ట పరిమితులు ఉండగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

సేవింగ్స్ అకౌంట్ లో లక్ష రూపాయలకు మించి నగదు జమ అయితే ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. కరెంట్ అకౌంట్ ఉన్నవాళ్లకు 50 లక్షల రూపాయలు పరిమితి కాగా ఈ పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను నోటీసులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు చెలింపులకు పరిమితి లక్ష రూపాయలుగా ఉంది. బిల్లు చెల్లింపులో నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసులకు సమాధానం చెప్పాలి.

ఫిక్స్ డ్ డిపాజిట్ లో నగదు డిపాజిట్ 10 లక్షల రూపాయలకు మించినా ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్టాక్స్, బాండ్, డిబెంచర్లు. మ్యూచువల్ ఫండ్లలో నగదు పరిమితిగా 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉంటే ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను రిటర్న్ లను తనిఖీ చేస్తుంది. ఆస్తులు కొనుగోలు చేసే లేదా విక్రయించే సమయంలో 30 లక్షల రూపాయల పరిమితిని మించి నగదు లావాదేవీలు ఉన్నా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో పరిమితికి మించి చేసే లావాదేవీలకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.