హెల్త్‌వెలుగులోకి మరో కొత్త వ్యాధి.. పసుపు రంగులోకి మారిన బాలుడి నాలుక?

వెలుగులోకి మరో కొత్త వ్యాధి.. పసుపు రంగులోకి మారిన బాలుడి నాలుక?

దేశంలో వైద్య శాస్త్రం అభివృద్ధి చెందుతుండగా అదే సమయంలో కొత్తకొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన సంగతితెలిసిందే. తాజాగా కెనడాలో మరో వింత వ్యాధి బయటపడటం గమనార్హం. కెనడాకు చెందిన 12 సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధ పడుతుండటం గమనార్హం.

12 సంవత్సరాల బాలుడు నాలుక పసుపు పచ్చగా మారడంతో పాటు గొంతు, కడుపు నొప్పి, మూత్రంలో సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు బాలుడు ఎప్సీన్‌ బార్ అనే వైరస్ బారిన పడ్డాడని గుర్తించారు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత బాలుడు రక్తహీనత సమస్యతో బాధ పడుతున్నాడని తేలింది. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రోగ నిరోధక శక్తి ఎర్రరక్తకణాలపై దాడి చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌ లో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక ప్రచురితమైంది. యూఎస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వల్ల ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడంతో పాటు రక్తహీనత, కామెర్లు కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను వినియోగించడం వల్ల బాలుడు సాధారణ స్థితికి చేరుకున్నాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని ఈ నివేదిక వెల్లడించింది.

ఎర్రరక్త కణాల విచ్ఛిన్నం వల్ల శరీరంలో బైరులిబిన్ పెరిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. అంతిమంగా పచ్చకామెర్లకు దారి తీసే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం...

Monique Jeremiah: తన పక్కన పడుకోవచ్చు.. టచ్ చేయకూడదు.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..

Monique Jeremiah: దూకుడు సినిమాలో అసలు మీద వడ్డీ.. వడ్డీ మీద చక్రవడ్డీ.. చక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ.. వసూలు చేస్తూనే ఉంటాను. ఇది వ్యాపారం.. అని బ్రహ్మానందం అంటుంటాడు గుర్తుందా.. ఈ...

Most Popular

Pimples Solution: మొటిమల సమస్యతో బాధపడేవారికి గుడ్ న్యూస్..

Pimples Solution: మహిళల్లో హార్మోన్ల మార్పుల కారణంగా మొటిమల సమస్యతో బాధపడుతున్నట్లు చాలా వరకు వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి కొందరు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్...

Deep Sleep Tips: వెంటనే గాఢ నిద్ర పట్టాలని అనుకుంటున్నారా… ఇలా చేయండి..

Deep Sleep Tips: నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ లేదా టీవీని ఎక్కువసేపు చూడడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం...

Fatty Liver: అలసట..ఆకలి తగ్గడంతో పాటు ఈ సమస్యలు ఉన్నాయా..

Fatty Liver: అలసట, కుడివైపు పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యం, బరువు పెరగడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అయితే వీటిని లైట్ గా తీసుకుంటారు. పెద్ద ఆరోగ్య సమస్య...

sunflower seeds : ఒక స్పూన్ సన్‌ఫ్లవర్ సీడ్స్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. వీటిని ఎలా తినాలి..

sunflower seeds : ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ డ్రై ఫ్రూట్స్, విత్తనాల వినియోగం కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది రోస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న...

After Meal Tips: భోజనం చేసిన వెంటనే ఇవి అస్సలు చేయొద్దు.. లేకుంటే డేంజర్లో పడ్డట్లే..

After Meal Tips: ప్రస్తుతం చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉంటున్నారు. ఇవి లేకపోతే వారికి మానసికంగా సంతృప్తి అనిపించదు. అయితే ఇవి సాధారణంగా కనిపించినా.. దీర్ఘకాలంలో...
Exit mobile version