https://oktelugu.com/

Revanth Reddy: కేసీఆర్ ను నమ్మనోడే బాగుపడ్డాడు.. రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: మే 6వ తేదీన వరంగల్ లో తలపెట్టిన రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల కోసం కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా నాయకులతో సోమవారం  సన్నాహక సమావేశం డీసీసీ కార్యాలయంలో అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గడ్డం వినోద్ లతో పాటు ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. అనంతరం మీడియా సమావేశంలో […]

Written By: , Updated On : April 25, 2022 / 10:17 PM IST
Follow us on

Revanth Reddy: మే 6వ తేదీన వరంగల్ లో తలపెట్టిన రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల కోసం కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా నాయకులతో సోమవారం  సన్నాహక సమావేశం డీసీసీ కార్యాలయంలో అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గడ్డం వినోద్ లతో పాటు ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. అనంతరం మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి  బీజేపీ, టీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డారు.

Revanth Reddy

Revanth Reddy

పార్లమెంటులో మంద బలం ఉందని నరేంద్ర మోడి రైతులను అణగత్రోక్కుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల పోరాటం వల్ల, రైతు పోరాట స్పూర్తి వలన రైతు చట్టాలను మోడీ వెనక్కు తీసుకున్నారు. పంజాబ్ రైతులు ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి బలి అయితుంటే ఏనాడు కూడా కెేసీఆర్ రైతులకి మద్దతు పలుకలేదు. ఢిల్లీ పోరాటంలో చనిపోయిన రైతులకి మూడు లక్షలు ఇస్తానన్న కేసీఆర్ ఇప్పటికి ఇవ్వలేదు.  మరోసారి కేసిఆర్ చేతిలో రైతులు మోసపొయారు. టీఆర్ఎస్ పాలనలో 74 వేల రైతుల ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తప్పిదాలని కప్పి పుచ్చుకొవాడానికి రాజకీయ కుతంత్రాలకి తెరలేపినారు.

ఐకేపి ధాన్యపు కేంద్రాలను సమయానికి తెరవ లేకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. చకల్లాల్లోకి కాంగ్రెస్ పేరుతో గతంలోనూ పోరాటం చేసింది. వరిని అడ్డం పెట్టుకొని రాజకియం చేసింది టిఆర్ఎస్ గాదా?  వరి వేసుకుంటే ఉరి అన్నది కేసీఆర్ కాదా? కేసీఆర్ పాంహౌస్ లో 150 ఎకారాలలొ వరి వేసుకున్నాడు.వడ్లు కొనకపోతే అమరవీరుల స్థాపానికి ఉరి తీస్తామని మేము చెప్పాం.కేసీఆర్ మాట వలన యాభై ఐదు లక్షల ఎకరాలలో వరి పండించాల్సిన రైతులు 35 లక్షల ఎకరాలలో మాత్రమే పండించారు. ఢిల్లీలో విందులు విలాసాలతో ఎంజాయ్ చేసారు టిఆర్ఎస్ వాళ్ళు.

గల్లివోజు ఢిల్లీలో,ఢిల్లివోడు గల్లీలా దర్నా చేస్తే.. వరి కొనాలని అడిగింది కాంగ్రెస్ మాత్రమే. వరి రైతులకి అండగా ఉంటానన్నది రాహుల్ గాంధీ. మా‌పోరాటాల వల్లనే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వరిని కొంటుంది. కెసిఆర్ ని పూర్తిగా నమ్మిన రైతులు పుర్తిగా మునిగారు.. కెసిఆర్ ని నమ్మనివాడు 1965 రూపాయలతో వడ్లని అమ్ముతున్నాడు. కేసీఆర్ ని నమ్మొద్దని ఈ విషయంలోనే తేలిపోయింది. ఇప్పటికే వరి ధాన్యం అమ్ముకున్నా వారికి క్వింటాలుకు 500 రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి. పూర్తిగా పంట వేయనివారికి ఎకరానికి 15000 రూపాయలు ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే వందరోజులలో చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తాంచెరుకు ప్యాక్టరీ తెరుస్తానన్న హామి నెరవెరక రైతులు నష్టపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు..

ఇక అనంతరం సీఎల్సీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. వరంగల్ లో రాహుల్ గాంధీ సభకు పెద్ద ఎత్తున రైతాంగం తరలిరావాలని పిలుపునిచ్చారు.  పంట వేయొద్దు మీకు ఉరే అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నే  రైతులను అవమనపరిచేలా చేశారు . ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో రైతాంగానికి అనేక రాయితీలు రుణాలు ఇచ్చేవారు గతంలో సబ్సిడీతో విత్తనాలు ఎరువులు ఇచ్చేవారు ఇప్పుడు రాయితీ లు అన్ని బంద్ అయి రుణమాఫీ కూడా అందట్లేదు.

Also Read: Perni Nani: మెగాస్టార్ చిరంజీవి దేవుడే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం?

రాష్ట్ర రైతాంగం విపరీతమైన ఇబ్బందిలో ఉందని.. రైతులకు బ్లాక్ మెయిల్ చేరి టి ఆర్ యస్ ప్రభుత్వం కు బుద్ధి చెప్పడానికే సభ పెడుతున్నాం.గతంలో చేసిన విధంగా రైతులకు రెండు లక్షల ఋణమాఫీ ఇచ్చేలా హామీ ఇవ్వనున్నాం. వరంగల్ నుండి దేశములో ఉన్న రైతాంగానికి దశ దిశ చూపుతామని భట్టి అన్నారు.

 కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్

ఆత్మత్యాగాలతో, బలిదానాలతో తెలంగాణ ఇలా అయినందుకు బాధేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అని అనిపిస్తోంది.ఆత్మత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఆత్మపరిశీలన చేసుకునే స్థితికి వచ్చారు. ఏ వర్గం కూడా సంతృప్తిగా కూడా లేదు.2004-2014 వరకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చింది ఉచిత విద్యుత్, పంట రుణాలు, రుణమాఫీ, మధ్దతుధరలాంటివి కల్పించింది కాంగ్రెస్.  తాలు పేరుతో రైతుల ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.

కేసీఆర్ మాట నమ్మి సాగు చేయని రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పంట వేయకుండా భూములు బీడు పెట్టుకున్న రైతులకు ఎకరాకు పదివేలు చెల్లించాలి.రైతుల పక్షాన మలిదశ ఉద్యమాన్ని కాంగ్రెస్ చేపడుతుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యధికంగా నష్టపోయింది కరీంనగర్ జిల్లా ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులు ఈ జిల్లా వారే.ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించి నెలరోజులు గడిచినా ఇంతవరకు తీసుకోలేదు.రాహుల్ సభ విజయవంతానికి ప్రతి రైతు కదలి రావాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read: Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, పవన్ కడుపున పవనే పుడతాడు !
Recommended Videos
Pawan Kalyan Koulu Rythu Bharosa Yatra || Political Heat in AP || Janasena vs YSRCP || Ok Telugu
Special Story on Prashant Kishor KCR Meeting || TRS vs Congress || Telangana Politics || Ok Telugu
కేసీఆర్: ఇక్కడ కాంగ్రెస్ తో కుస్తీ ఢిల్లీలో దోస్తీ || Prashant Kishor: TRS, Congress Politics