https://oktelugu.com/

Hari Hara Veera Mallu: పవన్ షూటింగ్ పిక్ వైరల్.. అటు వైపు తదేకంగా చూస్తున్న పవన్ !

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథతో చేస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో వస్తున్న మొఘల్ చక్రవర్తుల కాలం నాటి కథతో ఈ చిత్రం సాగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఐతే, ఈ రోజు ఈ సినిమా షూటింగ్ కి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 26, 2022 / 08:19 AM IST
    Follow us on

    Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో తొలిసారిగా చారిత్రక నేపథ్యం కలిగిన కథతో చేస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో వస్తున్న మొఘల్ చక్రవర్తుల కాలం నాటి కథతో ఈ చిత్రం సాగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

    Hari Hara Veera Mallu

    ఐతే, ఈ రోజు ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. పైగా ఈ పిక్ ను దర్శకుడు క్రిష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫోటోలో పవర్ స్టార్ చాలా ఇంటెన్స్ లుక్ తో కెమెరాలోని షాట్ ను తదేకంగా పరిశీలిస్తూ కనిపించారు.

    Also Read:KGF2 Collections: దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 6వ చిత్రంగా కేజీఎఫ్2.. ఆర్ఆర్ఆర్ ను బీట్ చేస్తుందా?

    అలాగే ఈ ఫోటోలో పవన్ పక్కన కెమెరామెన్ జ్ఞానవేల్ శేఖర్, పవన్ వెనుక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా కనిపించారు. అందరూ షాట్ వైపే ఆసక్తిగా చూస్తూ కనిపించడం చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ హరి హర వీర మల్లు పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    ఇప్పటికే 60 శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ప్రస్తుత షెడ్యూల్ పూర్తి కాగానే పవన్ మళ్ళీ 20 రోజుల బ్రేక్ తీసుకోబోతున్నారు. ఈ ఇరవై రోజులు పవన్, హరీష్ శంకర్ సినిమా పై కూర్చుంటాడట. ఇక క్రిష్ – పవన్ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. కోహినూర్ వ‌జ్రం చుట్టూ తిరిగే క‌థ ఇది. ప‌వ‌న్ ది రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో నటిస్తున్నాడు.

    Hari Hara Veera Mallu

    తన పార్ట్ కి సంబంధించి ఇప్పటికే పూర్తి అయిన సీన్స్ ను పవన్ ఆల్ రెడీ చూసాడట. పవన్ కి క్రిష్ డైరెక్షన్ చాలా బాగా నచ్చిందట. పైగా పవన్ కి ఈ సినిమాలో 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు క్రిష్. ఒకటి వజ్రాల దొంగ వీరమల్లు గెటప్ అయితే, సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా మరో గెటప్, అలాగే దేశం కోసం పోరాడే వీరుడిగా మరో గెటప్ లో పవన్ కనిపించబోతున్నాడు. అన్నిటికీ మించి 17వ శతాబ్దం నాటి కథ కావడంతో.. పవన్ దుస్తులు, యాక్ససరీస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

    Also Read:Mokshagna Nandamuri: పాన్ ఇండియా డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా.. బాలయ్య ఫ్యాన్స్ కి పండగే !

    Recommended Videos:

    Tags