Homeజాతీయ వార్తలుRevanth Reddy: కేసీఆర్ ను నమ్మనోడే బాగుపడ్డాడు.. రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: కేసీఆర్ ను నమ్మనోడే బాగుపడ్డాడు.. రేవంత్ హాట్ కామెంట్స్

Revanth Reddy: మే 6వ తేదీన వరంగల్ లో తలపెట్టిన రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఏర్పాట్ల కోసం కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా నాయకులతో సోమవారం  సన్నాహక సమావేశం డీసీసీ కార్యాలయంలో అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి గడ్డం వినోద్ లతో పాటు ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. అనంతరం మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి  బీజేపీ, టీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డారు.

Revanth Reddy
Revanth Reddy

పార్లమెంటులో మంద బలం ఉందని నరేంద్ర మోడి రైతులను అణగత్రోక్కుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల పోరాటం వల్ల, రైతు పోరాట స్పూర్తి వలన రైతు చట్టాలను మోడీ వెనక్కు తీసుకున్నారు. పంజాబ్ రైతులు ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి బలి అయితుంటే ఏనాడు కూడా కెేసీఆర్ రైతులకి మద్దతు పలుకలేదు. ఢిల్లీ పోరాటంలో చనిపోయిన రైతులకి మూడు లక్షలు ఇస్తానన్న కేసీఆర్ ఇప్పటికి ఇవ్వలేదు.  మరోసారి కేసిఆర్ చేతిలో రైతులు మోసపొయారు. టీఆర్ఎస్ పాలనలో 74 వేల రైతుల ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తప్పిదాలని కప్పి పుచ్చుకొవాడానికి రాజకీయ కుతంత్రాలకి తెరలేపినారు.

ఐకేపి ధాన్యపు కేంద్రాలను సమయానికి తెరవ లేకపోవడం వల్ల రైతులు నష్టపోయారు. చకల్లాల్లోకి కాంగ్రెస్ పేరుతో గతంలోనూ పోరాటం చేసింది. వరిని అడ్డం పెట్టుకొని రాజకియం చేసింది టిఆర్ఎస్ గాదా?  వరి వేసుకుంటే ఉరి అన్నది కేసీఆర్ కాదా? కేసీఆర్ పాంహౌస్ లో 150 ఎకారాలలొ వరి వేసుకున్నాడు.వడ్లు కొనకపోతే అమరవీరుల స్థాపానికి ఉరి తీస్తామని మేము చెప్పాం.కేసీఆర్ మాట వలన యాభై ఐదు లక్షల ఎకరాలలో వరి పండించాల్సిన రైతులు 35 లక్షల ఎకరాలలో మాత్రమే పండించారు. ఢిల్లీలో విందులు విలాసాలతో ఎంజాయ్ చేసారు టిఆర్ఎస్ వాళ్ళు.

గల్లివోజు ఢిల్లీలో,ఢిల్లివోడు గల్లీలా దర్నా చేస్తే.. వరి కొనాలని అడిగింది కాంగ్రెస్ మాత్రమే. వరి రైతులకి అండగా ఉంటానన్నది రాహుల్ గాంధీ. మా‌పోరాటాల వల్లనే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వరిని కొంటుంది. కెసిఆర్ ని పూర్తిగా నమ్మిన రైతులు పుర్తిగా మునిగారు.. కెసిఆర్ ని నమ్మనివాడు 1965 రూపాయలతో వడ్లని అమ్ముతున్నాడు. కేసీఆర్ ని నమ్మొద్దని ఈ విషయంలోనే తేలిపోయింది. ఇప్పటికే వరి ధాన్యం అమ్ముకున్నా వారికి క్వింటాలుకు 500 రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి. పూర్తిగా పంట వేయనివారికి ఎకరానికి 15000 రూపాయలు ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే వందరోజులలో చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తాంచెరుకు ప్యాక్టరీ తెరుస్తానన్న హామి నెరవెరక రైతులు నష్టపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు..

ఇక అనంతరం సీఎల్సీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. వరంగల్ లో రాహుల్ గాంధీ సభకు పెద్ద ఎత్తున రైతాంగం తరలిరావాలని పిలుపునిచ్చారు.  పంట వేయొద్దు మీకు ఉరే అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ నే  రైతులను అవమనపరిచేలా చేశారు . ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో రైతాంగానికి అనేక రాయితీలు రుణాలు ఇచ్చేవారు గతంలో సబ్సిడీతో విత్తనాలు ఎరువులు ఇచ్చేవారు ఇప్పుడు రాయితీ లు అన్ని బంద్ అయి రుణమాఫీ కూడా అందట్లేదు.

Also Read: Perni Nani: మెగాస్టార్ చిరంజీవి దేవుడే. కానీ పవన్ కల్యాణ్ మాత్రం?

రాష్ట్ర రైతాంగం విపరీతమైన ఇబ్బందిలో ఉందని.. రైతులకు బ్లాక్ మెయిల్ చేరి టి ఆర్ యస్ ప్రభుత్వం కు బుద్ధి చెప్పడానికే సభ పెడుతున్నాం.గతంలో చేసిన విధంగా రైతులకు రెండు లక్షల ఋణమాఫీ ఇచ్చేలా హామీ ఇవ్వనున్నాం. వరంగల్ నుండి దేశములో ఉన్న రైతాంగానికి దశ దిశ చూపుతామని భట్టి అన్నారు.

 కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్

ఆత్మత్యాగాలతో, బలిదానాలతో తెలంగాణ ఇలా అయినందుకు బాధేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అని అనిపిస్తోంది.ఆత్మత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఆత్మపరిశీలన చేసుకునే స్థితికి వచ్చారు. ఏ వర్గం కూడా సంతృప్తిగా కూడా లేదు.2004-2014 వరకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చింది ఉచిత విద్యుత్, పంట రుణాలు, రుణమాఫీ, మధ్దతుధరలాంటివి కల్పించింది కాంగ్రెస్.  తాలు పేరుతో రైతుల ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.

కేసీఆర్ మాట నమ్మి సాగు చేయని రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పంట వేయకుండా భూములు బీడు పెట్టుకున్న రైతులకు ఎకరాకు పదివేలు చెల్లించాలి.రైతుల పక్షాన మలిదశ ఉద్యమాన్ని కాంగ్రెస్ చేపడుతుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యధికంగా నష్టపోయింది కరీంనగర్ జిల్లా ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులు ఈ జిల్లా వారే.ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించి నెలరోజులు గడిచినా ఇంతవరకు తీసుకోలేదు.రాహుల్ సభ విజయవంతానికి ప్రతి రైతు కదలి రావాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also Read: Akira Nandan: ‘పులి కడుపున పులే పుడుతుంది’, పవన్ కడుపున పవనే పుడతాడు !
Recommended Videos

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Kapu Politics: రాష్ట్రంలో ఒక విక్రుత రాక్షస క్రీడకు తెరతీశారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో తనకు ప్రతిబంధకంగా మారుతారని జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. దారికి తెచ్చుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాపు సామాజికవర్గం పవన్ వెంట నడవకుండా ఉండేందుకు ఆ వర్గంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల రాజకీయంగా పవన్ దూకుడు పెంచడంతో జగన్ కంటిమీద కునుకు లేకుండా పోతోంది. పవన్ తన కంట్లో నలుసుగా మారారని నొచ్చకుంటున్నారు. పవన్ రైతుభరోసా యాత్రల పేరిట జనాల్లోకి వస్తుండడం, యువత ఆదరణ పెరుగుతుండడం, పవన్ పొత్తుల ప్రకటన చేస్తుండడంతో జగన్ లో అభద్రతా భావం పెరిగిపోయింది. ఓటమి భయం పట్టకుంది. దీంతో తనకు అచ్చొచ్చిన కుల రాజకీయాలకు తెరతీశారు. తాజాగా తన కేబినెట్ లోకి తీసుకున్న కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్ నాథ్, దాడిశెట్టి రాజాలను పురిగొలిపారు. అధినేత ఇచ్చిన టాస్కును పూర్తిచేయాలన్న ఆత్రుతతో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా విపరీత వ్యాఖ్యానాలు చేశారు. కుటుంబసభ్యులను తెరపైకి తెచ్చి కించపరుస్తూ మాట్లాడారు. దీనిపై జన సైనికులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు సామాజికవర్గం నాయకులు, ప్రతినిధులు సైతం స్పందించారు. ఆ ముగ్గురు మంత్రుల తీరును తప్పుపట్టారు. వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular