Goutam Adani: ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ దూసుకుపోతున్నారు. ఈ గుజరాతీ వ్యాపారి… మోడీ ప్రభుత్వ హయాంలో తన సంపదను తెగ పోగేసుకుంటున్నారు. దేశంలోని పోర్టులు, వ్యాపారాలు విస్తరిస్తూ ఏకంగా ప్రపంచ కుబేరుడిగా ఎదుగుతున్నాడు. దేశంలోనే నంబర్ 1 కుబేరుడు ముకేష్ అంబానీని కూడా దాటేస్తున్నాడు.

తాజాగా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో గౌతం అదానీ ఏకంగా ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 5లో చోటు సంపాదించుకోవడం విశేషం. అమెరికా వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ ను వెనక్కి నెట్టి 123.7 బిలియన్ డాలర్ల సంపదతో ఐదోస్థానంలో నిలిచారు. శుక్రవారం మార్కెట్ ముగింపు అనంతరం గౌతం అదానీ భారీగా లాభపడి ఈ మైలురాయికి చేరుకున్నారు.
Also Read: KCR- National Party: యాంటీ బీజేపీ: కేసీఆర్ జాతీయ పార్టీ?
గౌతం అదానీ పోర్టులు, విమానాశ్రయాల నిర్వహణ వంటి వ్యాపారాలతో భారీగా సంపాదిస్తున్నారు. ఓ వైపు కోవిడ్ తో అందరి వ్యాపారాలు కునారిల్లుతున్నాయి. దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం అవుతున్నాయి. కానీ అదానీ వ్యాపారాలు మాత్రం దూసుకెళ్లడం విశేషం.
దీంతో ఒక్క 2022 సంవత్సరంలోనే అదానీ సందప విలువ 43 బిలియన్ డాలర్లు పెరిగింది. మొత్తంగా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 56శాతం పెరిగింది. ఈ దెబ్బకు భారత్ తోపాటు ఆసియాలోనే నంబర్ 1 కుబేరుడిగా గౌతం అదానీ ఎదిగారు.
ఇక ఇప్పటివరకూ ఆసియా కుబేరుడిగా.. దేశంలోనే నంబర్ 1 గా సంపాదన పరుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని గౌతం అదానీ వెనక్కి నెట్టారు. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతం అదానీ తాజాగా టాప్ 5లోకి దూసుకెళ్లారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడిగా ఎలాన్ మస్క్ 269.7 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన తర్వాత అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ 170.2 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో.. బెర్నార్డ్ అర్నాల్డ్ 167.9 బిలియన్ డాలర్లతో మూడో స్తానంలో.. బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read: Acharya: ఆచార్య సినిమా అనుకున్న సమయానికి వస్తుందా.. ఇప్పటికి ఎంతో బాలన్స్ ఉన్న వర్క్
Recommended Videos
[…] Free Ration: కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ ఎప్పుడొస్తుందా అని లబ్ధిదారులు ఎదురుచూస్తుంటే.. ఎప్పుడు నిలిపివేస్తరా అని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. ఆహార భద్రత చట్టంలో భాగంగా కేవలం సగం రేషన్ కార్డులకు మాత్రమే కేంద్రం ఉచిత రేషన్ అందిస్తోంది. మిగతా సగం కార్డులకు ఏపీ ప్రభుత్వమే ఫ్రీ రేషన్ సర్దుబాటు చేస్తోంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతుందన్న ఆందోళనలో జగన్ సర్కారు ఉంది. అందుకే ఎలాగోలా బియ్యం అందించి నెట్టుకొస్తోంది. అయితే ఇలా సర్దుబాటు చేసే క్రమంలో నెలనెలా ఫ్రీ రేషన్ సక్రమంగా అందించలేకపోతోంది. […]
[…] Read:Goutam Adani: ప్రపంచ కుబేరుల్లో 5వ స్థానానికి.… Recommended […]