https://oktelugu.com/

Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టార్గెట్ 40 సీట్లు.. మళ్లీ దానికో లెక్కుంది..?

Revanth Reddy: తెలంగాణలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టాక పార్టీకి జవసత్వం వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఇన్నిరోజులు సైలంట్‌గా ఉన్న కేడర్‌లో ఒక్కసారిగా చలనం తీసుకొచ్చారు. వరసగా పర్యటనలు చేస్తూ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో రెండేళ్లు ఏకచత్రాధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ 2014లో మొత్తానికి డీలా పడిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీతో ప్రమాదమే అని భావించి ఆ పార్టీని నామారూపాల్లేకుండా […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 31, 2021 11:46 am
    Follow us on

    Revanth Reddy: తెలంగాణలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టాక పార్టీకి జవసత్వం వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఇన్నిరోజులు సైలంట్‌గా ఉన్న కేడర్‌లో ఒక్కసారిగా చలనం తీసుకొచ్చారు. వరసగా పర్యటనలు చేస్తూ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో రెండేళ్లు ఏకచత్రాధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ 2014లో మొత్తానికి డీలా పడిపోయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీతో ప్రమాదమే అని భావించి ఆ పార్టీని నామారూపాల్లేకుండా చేసేసారు.సీఎల్పీని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని హస్తం పార్టీని దారుణంగా దెబ్బతీశారు.

    Revanth Reddy

    Revanth Reddy

    అయితే, తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు రావొచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర బీజేపీ నేత‌ల‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే మాట చెప్ప‌ారు. ముంద‌స్తుపై సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. దీంతో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే పార్టీని బలోపేతం చేసేందుకు నిరుద్యోగ నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధ‌మ‌వుతోంది. గతంలోగా పొరపాట్లు దొర్లకుండా అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాలను బలోపేతం చేయడంతో పాటు ప్రచారంలోనూ దూకుడు పెంచాలని భావిస్తోంది.

    Also Read: కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లపై రేవంత్ కొత్త లెక్కలు..

    వచ్చే ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ 40 సీట్లు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నారట.. మొత్తం 117 సీట్లలో 60 సీట్లు వచ్చిన పార్టీ అధికారాన్ని చేపడుతుంది. అయితే, టీఆర్ఎస్ పార్టీపై ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గెలుస్తారని రేవంత్ భావిస్తున్నారు. అందుకు అదనంగా మరో 40 సీట్లు రాబడితే ఎలాగైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. ఒకవేళ 60సీట్లకు దగ్గరి దాక వచ్చినా ఏదో ఒక పార్టీ లేదా స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వానికి ఏర్పాటు చేయొచ్చని భావిస్తున్నారట..

    Also Read: వరి విషయంలో కేసీఆరే టార్గెట్.. రేవంత్ ప్లాన్ సక్సెస్..!

    Tags