https://oktelugu.com/

Movie Tickets Prices: మూవీ టికెట్స్ ధరలు.. ఏపీలో వాత.. తెలంగాణలో మోత..?

Movie Tickets Prices AP, Telangana: మూవీ టికెట్ల ధరల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా మరియు థియేటర్లు మండలిని అటు ఏపీ ప్రభుత్వం కట్టడి చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మీకు నచ్చినట్టు చేసుకోండంటూ స్నేహ హస్తం ఇస్తోంది. ఈ రెండు ప్రభుత్వాలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో తెలీక సామాన్య ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలు మేలు చేసినా […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 31, 2021 / 11:21 AM IST
    Follow us on

    Movie Tickets Prices AP, Telangana: మూవీ టికెట్ల ధరల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినిమా మరియు థియేటర్లు మండలిని అటు ఏపీ ప్రభుత్వం కట్టడి చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మీకు నచ్చినట్టు చేసుకోండంటూ స్నేహ హస్తం ఇస్తోంది. ఈ రెండు ప్రభుత్వాలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో తెలీక సామాన్య ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలు మేలు చేసినా థియేటర్ల యాజమాన్యాలు రోడ్డున పడాల్సి వస్తుంది. కనీసం థియేటర్లో పనిచేసే వర్కర్లకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులు వచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం పూర్తిగా అందుకు భిన్నం. ఇప్పటికే టికెట్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. మళ్లీ పెంచుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో అసలు సామాన్యుడి థియేటర్ల గడప దొక్కేందుకు కూడా వెనుకాడాల్సి వస్తోంది.

    Movie Tickets Prices AP, Telangana:

    ఏపీ ప్రభుత్వం అక్కడి థియేటర్లలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలుగా విభజించి టికెట్ రేట్లను ఖరారు చేసింది. దీని ప్రకారం మినిమమ్ టికెట్ ధరను 5 రూపాయల నుంచి గరిష్ట చార్జిని 250 వరకు నిర్ణయించింది. టికెట్ ఇష్యూను కూడా ఆన్ లైన్ చేసేసింది. ఆఫ్ లైన్ అమ్మడానికి వీల్లేదు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో సినీ తారలు పెదవి విరుస్తున్నారు. ఈ ధరలపై హీరో నేచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఏపీ మంత్రులకు, సెలబ్రిటీలకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సామాన్యుడికి వంద రూపాయలు పెట్టి టికెట్ కొనే స్థోమత ఉందని, సమోస రేట్లకంటే టికెట్ ధరలు తక్కువగా ఉంటే కిరాణా కోట్టోడు లాభపడుతాడు కానీ థియేటర్స్ ఓనర్స్ కాదని నాని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

    Also Read:   కాపులను మోసం చేస్తుందెవరు.. ట్రెండింగ్ లో ఇద్దరు నేతలు?

    ఇక తెలంగాణలోని మల్టీప్లెక్సుల్లో కనీస ధర రూ.150గా ఉంది. ఏఎంబీ వంటి పెద్ద మల్టీప్లెక్సుల్లో రూ.200 కనీస ధరతో టికెట్లు అమ్ముతున్నారు. సింగిల్ స్క్రీన్లలో సగటు ధర రూ.110-120గా ఉన్నాయి. ఈ ధరలు ప్రస్తుతానికి ప్రేక్షకులకు ఓకే. కానీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్లలోనే కనీస ధరను రూ.200 చేసేశారు. మల్టీప్లెక్సుల రేటు రూ.250తో మొదలవుతోంది. ఇది ప్రేక్షకులకు కచ్చితంగా భారమే. ఇన్నాళ్లూ ప్రసాద్ మల్టీప్లెక్సులో రూ.150గా ఉన్న ధర ఒక్కసారిగా రూ.295కి పెరిగింది. ఇక బుక్ మై షోలో బుక్ చేస్తే ఇంకో రూ.20 అదనం. ఇంత ధరలు పెట్టి సామాన్యుడి రెండున్నర గంటల మూవీ చూస్తాడా? ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ‘ఆహా’ అయితే అదే డబ్బులకు ఏడాది సబ్ స్క్రిప్షన్ ఇస్తోంది. దీంతో జానాలు ఓటీటీకి జై కొడితే అప్పుడు తెలిసివస్తుందని అంతా అనుకుంటున్నారు.

    Also Read:  వరి విషయంలో తెలంగాణకు అభినందన.. కేంద్రం ట్విస్ట్

    Tags