సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

కరోనా మహమ్మరితో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సమాచారం అందిస్తూ జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వనికి ఉందని రేవంత్ రెడ్డి […]

Written By: Neelambaram, Updated On : June 11, 2020 12:08 pm
Follow us on


కరోనా మహమ్మరితో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు సమాచారం అందిస్తూ జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వనికి ఉందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

జర్నలిస్టులు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారని తెలిపారు. అయితే ఈ సమయంలోనూ కొందరు జర్నలిస్టులు ఈ మహమ్మరి బారినపడి మృత్యువాత పడటం శోచనీయమన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులందరికీ ప్రభుత్వం 10వేల రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వమే 50లక్షల హెల్త్ బీమా కల్పించాలని కోరారు. జర్నలిస్టులకు ఉచితం కరోనా పరీక్షలు చేయాలన్నారు.

అదేవిధంగా కరోనాతో మృతిచెందిన మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం 50లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలపై తక్షణమే స్పందించాలని రేవంత్ ఆ లేఖలో డిమాండ్ చేశారు.