https://oktelugu.com/

ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు కష్టం?

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు నిర్వహించడం కష్టంగా మారింది. దీనికి తోడు జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోనాల విషయంలో ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతుంది. ప్రజలు ఇంట్లోనే అమ్మవారికి బోనం సమర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఘటాల ఊరేగింపును పూజారులే దేవాలయాల పరిసరాల్లో చేపడతారని, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు కూడా వాళ్లే సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. బుధవారం మర్రి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 11, 2020 / 12:21 PM IST
    Follow us on

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు నిర్వహించడం కష్టంగా మారింది. దీనికి తోడు జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోనాల విషయంలో ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతుంది. ప్రజలు ఇంట్లోనే అమ్మవారికి బోనం సమర్పించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఘటాల ఊరేగింపును పూజారులే దేవాలయాల పరిసరాల్లో చేపడతారని, అమ్మవార్లకు పట్టువస్ర్తాలు కూడా వాళ్లే సమర్పిస్తారన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన బోనాల ఉత్సవాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

    ప్రతి ఏటా జరిగే బోనాల జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని, ఈసారి కరోనా వైరస్‌ వ్యాపించే ప్రమాదం ఉన్నందున సామూహిక బోనాల పండుగ జరుపుకోవడం మంచిది కాదని తెలిపారు. నచ్చిన పద్ధతిలో బోనం తయారు చేసి సూర్యభగవానుడికి చూపించి, అమ్మవారి చిత్రపటం ముందు సమర్పించాలని ఆడపడుచులకు ఆయన సూచించారు. భక్తులెవరూ అమ్మవారి ఆలయాలకు బోనంతో రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలయాల్లో పూజారులే పూజలు, అలంకరణలు, బోనం చేస్తారని అన్నారు. అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టువస్ర్తాలు ఒకరోజు ముందుగానే ఆలయాలకు అందజేస్తామని తెలిపారు.