Pawan Kalyan Rishikonda Visit: పవన్ రిషికొండ సందర్శనకు అడుగడుగున ఆంక్షలు

పోలీసుల ఆంక్షలు నడుమే రిషికొండ ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అయితే కొండ వద్దకు వెళ్లకూడదని బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. దూరం నుంచే చూడాలని పవన్ కు స్పష్టం చేశారు. అయితే పవన్ వారికి ఝలక్ ఇచ్చారు. బారికేడ్ దూరిమరీ రిషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు.

Written By: Dharma, Updated On : August 12, 2023 1:33 pm

Pawan Kalyan Rishikonda Visit

Follow us on

Pawan Kalyan Rishikonda Visit: పవన్ దూకుడు పెంచారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం విశాఖలో వారాహి 3.0 యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. పవన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ క్రమంలో రుషికొండ పర్యటనలో పవన్ చేసిన హాట్ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

పోలీసుల ఆంక్షలు నడుమే రిషికొండ ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అయితే కొండ వద్దకు వెళ్లకూడదని బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. దూరం నుంచే చూడాలని పవన్ కు స్పష్టం చేశారు. అయితే పవన్ వారికి ఝలక్ ఇచ్చారు. బారికేడ్ దూరిమరీ రిషికొండ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న మీడియా వాహనంపై ఎక్కి నిర్మాణాలను చూశారు. కొండ తవ్వకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటు తర్వాత సీఎం జగన్ పై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. నిబంధనలు పాటించాల్సిన సీఎం.. వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు.

వైసిపి నాయకులు పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ఇదే తరహా దోపిడీ చేసినందుకు అక్కడ నుంచి తరిమి కొట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖ పై పడి లూటీ చేస్తున్నారని ఆరోపించారు. పవన్ రిషికొండ ను పరిశీలించే సమయంలో పోలీసులు భారీ భద్రతను కల్పించారు. నగరంలోని జోడు గుల్ల పాలెం నుంచి రిషికొండ వరకు ఐదు అంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తానికైతే పవన్ రిషికొండ సందర్శనను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయగలిగారు.