Homeజాతీయ వార్తలుRepublic Day 2025 : గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు? ఈ...

Republic Day 2025 : గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు? ఈ సారి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా ?

Republic Day 2025 : ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Prabowo Subianto) హాజరుకానున్నారు. సుబియాంటో జనవరి 25, 26 తేదీలలో భారతదేశంలో ఉంటారు. గత సంవత్సరం గణతంత్ర దినోత్సవం(Republic Day ) సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్ ఫట్టా అల్-సిసి భారతదేశాన్ని సందర్శించారు. భారతదేశంలో జనవరి 26 సందర్భంగా ముఖ్య అతిథిని ఆహ్వానించే సంప్రదాయం 1950 నుండి ప్రారంభమైంది.

ఈ సంవత్సరం ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో భారత పర్యటన(india tour) అనేక విధాలుగా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో.. భారతదేశం ముఖ్య అతిథిని ఎలా ఎంచుకుంటుంది.. సుబియాంటో భారత పర్యటనను ఎందుకు ప్రత్యేకంగా పరిగణిస్తారు అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఎంపిక చేయడం భారత ప్రభుత్వానికి ఎంతో ప్రాముఖ్యమైన అంశం. ఇది ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో.. అంతర్జాతీయ సంబంధాల్లో కీలక పాత్ర పోషించడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో ప్రధానంగా పలు అంశాలను పరిశీలిస్తారు.

ముఖ్య అతిథిని ఎంపిక చేసే విధానం:
* ద్వైపాక్షిక సంబంధాలు: ఒక దేశంతో భారతదేశానికి ఉన్న రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, రక్షణ, సాంస్కృతిక సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఉదాహరణకు.. ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండడం లేదా రెండు దేశాల మధ్య సాంప్రదాయ బంధం ఉండటం.
* గ్లోబల్ స్థితి: అతిథి దేశం ప్రపంచ రాజకీయాల్లో లేదా ఆర్థిక వ్యవస్థలో ప్రాముఖ్యమైన దేశమై ఉంటే ఆ దేశ నాయకుడిని ఆహ్వానించడం ద్వారా భారతదేశం తమ వ్యూహాత్మక ఆవశ్యకతలను ముందుకు తీసుకెళ్తుంది.
* ప్రధానమంత్రి, రాష్ట్రపతి చర్చలు: ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, రాష్ట్రపతి(President) చర్చించిన తర్వాత అతిథి ఎంపిక జరుగుతుంది. ఇది మంత్రివర్గంలోని ఇతర సభ్యులతో కూడిన చర్చల అనంతరం నిర్ధారించబడుతుంది.
* అంతర్జాతీయ సంబంధాల ప్రభావం: గణతంత్ర దినోత్సవ వేడుకల నిమిత్తం ముఖ్య అతిథిని ఆహ్వానించడం ద్వారా సంబంధిత దేశంతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా, లేదా దక్షిణ అమెరికా వంటి ప్రాంతాలలో భారత్ దృష్టి పెట్టిన దేశాలను ఎంపిక చేస్తుంది.

విదేశీ అతిథులకు అత్యున్నత గౌరవం
భారతదేశానికి ముఖ్య అతిథిగా ఒక విదేశీ నాయకుడిని చేయడం అత్యున్నత గౌరవం. ఆయన అన్ని గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఉంటారు. ఆయనకు 21 తుపాకీలతో సెల్యూట్ ఇవ్వబడుతుంది. ఆయనకు రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం సమర్పించారు. సాయంత్రం భారత రాష్ట్రపతి ఆయన గౌరవార్థం ప్రత్యేక స్వాగతం పలుకుతారు.

ఆయన రాజ్ ఘాట్ ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ప్రధానమంత్రి ఆయన గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో ఉపరాష్ట్రపతి, విదేశాంగ మంత్రితో సహా అనేక మంది ప్రముఖులు ఆయనను కలుస్తారు. ఈ కారణంగానే ముఖ్య అతిథికి ఇచ్చే గౌరవం అనేక విధాలుగా చాలా ప్రత్యేకమైనది. ఏ ప్రపంచ నాయకుడికీ దీన్ని ఇలా సాధించే అవకాశం రాదు. సుదీర్ఘ ప్రక్రియ తర్వాత ముఖ్య అతిథి పేరు నిర్ణయించబడుతుంది.

ఇండోనేషియా అధ్యక్షుడు ఎందుకంటే .. ఇండోనేషియా దక్షిణ ఆసియాలో ఉన్న ప్రముఖ దేశం, భారతదేశానికి ప్రధాన వ్యాపార భాగస్వామి. రెండు దేశాల మధ్య సాంస్కృతిక, వ్యాపార సంబంధాలు 2,000 ఏళ్లకు పైగా కొనసాగుతున్నాయి. ఇండోనేషియా సముద్ర మార్గాలలో అత్యంత వ్యూహాత్మకమైన స్థానం కలిగి ఉంది. రెండూ దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, వాణిజ్యం, వ్యూహాత్మక కూటములను బలోపేతం చేసుకునే దిశగా ఉన్నందున, ఈ ఆహ్వానం వ్యూహాత్మకంగా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిని ఆహ్వానించడం కేవలం సాంప్రదాయ ప్రక్రియ మాత్రమే కాదు, దేశాల మధ్య ఉన్న సంబంధాలను బలోపేతం చేసేందుకు కీలక ఉదాహరణ కూడా.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular