Chanakya Niti: అపర చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని కాపాడడమే కాకుండా వ్యక్తుల జీవితానికి సంబంధించి విలువైన సూత్రాలను ప్రజలకు అందించాడు. ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఇతరులతో ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలపై తెలియజెప్పాడు. సమాజంలో ఎంతో మంది వ్యక్తులు ఉంటారు. కానీ అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు. వీరిలో కొందరు మంచివారు..మరికొందరు చెడ్డవారు ఉంటారు. మంచివారితో ఎలా మెలగాలి? చెడ్డవారి విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలి? అనే విషయాలపై చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా బోధనలు చేశారు. వీటిలో ప్రముఖంగా చెప్పేది ఏంటంటే..? కొందరు వ్యక్తులు ఇంట్లోకి రావడం వల్ల ఇంటి వాతావరణం మారిపోతుందట. ముఖ్యంగా కొందరి మనస్తత్వాలతో ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందరని చాణక్యుడు చెప్పాడు. ఆ వ్యక్తులు ఎవరంటే?
పాఖండులను ఇంటికి పిలవడం వల్ల మనసు మారిపోతుందని చాణక్యుడు చెప్పారు. పాఖండులు అనగా మనసులో ఒకటి ఉండి.. మరొకటి మాట్లాడే వారు. ఇలాంటి వారు పైకి మంచిగా మాట్లాడుతూనే.. లోపల వేరే ఆలోచిస్తారు. ఇలాంటి వారి వల్ల ఎప్పటికైనా ఇబ్బందులే ఉంటాయని చాణక్యుడు చెప్పారు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.
కొందరు వ్యక్తులు కొన్ని రోజుల పాటు దొంగతనం.. దోపిడీ చేసి.. ఆ తరువాత వదిలేస్తారు. కానీ వారి మనసులో ఎక్కడో చోట ఆ ఫీలింగ్ ఉండే ఉంటుంది. ఇలాంటి వారిని ఇంట్లోకి పిలవడం వల్ల సమాజంలో చులకనగా మారిపోతారు. అంతేకాకుండా ఆ వ్యక్తులు ఎప్పటికీ ఒకే ప్రవర్తన ఉంటుందని చెప్పలేం. అందువల్ల ఇలాంటి వ్యక్తులను ఇంటికి పిలవకుండా జాగ్రత్తగా ఉండాలి.
సమాజంలో ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం ఉంటుంది. ఈ డబ్బు కోసం మనుషుల మధ్య ఈర్ష్య, ద్వేషాలు ప్రారంభం అవుతాయి. అయితే ఇవి పరిమితి మించితే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. అయితే కొందరు నిత్యం డబ్బు కోసం ఇతర వ్యక్తులపై అజమాయిషీ ఉంటుంది. డబ్బు కోసం ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంటారు. ఇలాంటి వ్యక్తులను ఇంటికి పిలవడం వల్ల ఎప్పటికైనా ప్రమాదమే ఉంటుంది. అంతేకాకుండా వీరు డబ్బు కోసం ఎదుటి వ్యక్తును ఏం చేయడానికైనా వెనుకాడరు.
కొందరు నిత్యం ఏదో కోల్పోయినట్లు కనిపిస్తారు. అంతేకాకుండా నిత్యం బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇలాంటి వ్యక్తలతో కలిసి ఉండడం వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది. దీంతో ఏ పని చేయడానికి ముందుకు కదలరు. ఇలాంటి వ్యక్తులను ఇంటికి పిలవడం వల్ల ఇంట్లోవాళ్లు సఫర్ అవుతూ ఉంటారు. అందువల్ల ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. వీరు ఒకవేళ స్నేహం చేయడానికి ముందుకు వచ్చినా పట్టించుకోవద్దు.
కొందరు ఆధ్యాత్మిక భావాలకు దూరంగా ఉంటారు. అంతేకాకుండా వీరు పక్క వ్యక్తులను ప్రభావం చేస్తారు.ఇలాంటి వారితో కలిసి ఉండడం వల్ల మనసు ప్రశాంతత కోల్పోతారు. ఇలాంటి వారు నాస్తికులకు దూరంగా ఉండాలి. ఒకవేళ వీరు ఎలాంటి ప్రభావవంతమైన పనులు చేసినా.. వాటిని పట్టించుకోకుండా ఉండాలి.