దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న సమయంలో దొడ్డిదారిన నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ రాజ్యాంగం పీఠికలో చేర్చిన `సామ్యవాదం’ పదాన్ని తొలగించాలని కోరుతూ నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు రాజ్యసభ ముందు ఒక బిల్ రాబోతున్నది. బిజెపి సభ్యుడు రాకేష్ సిన్హా ప్రతిపాదించిన ఈ బిల్ శుక్రవారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులలో ఆ పదానికి అర్ధం లేదని, ఒక ఆలోచనకు పరిమితం కాకుండా ఆర్ధిక అంశాలను చర్చించే వీలు కల్పిస్తూ ఆ పదాన్ని తొలగించాలని ఆయన కోరుతున్నారు.
శుక్రవారం ప్రైవేట్ సభ్యుల బిల్లులకు కేటాయించిన సమయంలో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం కోసం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అనుమతో కోరుతూ రాకేష్ సిన్హా లేఖ వ్రాసారు. ఆయన నోటీసు ను బుధవారం అనుమతించారు. అత్యవసర పరిస్థితి సమయంలో, ప్రతిపక్ష నేతలు అందరు దాదాపుగా జైళ్లల్లో ఉన్న సమయంలో రాజ్యాంగంలో `సామ్యవాదం’ పదంతో పాటు `లౌకికవాదం’ పదాన్ని చేరుస్తూ 42వ రాజ్యాంగ సవరణలో చేర్చారు.
`సామ్యవాదం’ ఒక ఆర్ధిక అంశమని, దానిని రాజ్యాంగ భూమికగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ ఆ పదాన్ని తొలగించాలని కోరుతూ 1991లో నాటి స్వతంత్ర పార్టీ మహారాష్ట్ర విభాగం ముంబై హైకోర్టు లో ప్రజావాజ్యంను వేసింది. వాజ్యం వేసిన ఇద్దరు మృతి చెందారు గాని, ఇప్పటి వరకు హై కోర్ట్ ఆ అంశాన్ని చేపట్టే ప్రయత్నం చేయక పోవడం గమనార్హం. 2015 రిపబ్లిక్ దినోత్సవం నాడు ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలలో ప్రచురించిన రాజ్యాంగం పీఠికలో `సామ్యవాదం’, `లౌకికవాదం’ పదాలు లేకపోవడంతో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
అయితే రాకేష్ సిన్హా తీర్మానంలో `సామ్యవాదం’ అనే పదాన్ని తొలగించమని లేకపోవడం గమనార్హం. మన సంస్కృతిలోని లౌకిక స్వభావం నెలకొన్నా ఆ పదానికి చాల అర్ధాలు ఉన్నాయని, కొందరు ఆ పదం అవసరమని భావించే అవకాశం ఉన్నదని చెప్పారు. కానీ, ప్రస్తుత సామజిక, ఆర్ధిక అభివృద్ధి నేపథ్యంలో సామ్యవాదం పదం అర్ధం లేనిదని స్పష్టం చేశారు.
పైగా, ఈ అంశంపై రాజ్యాంగ సభలో సవివరమైన చర్చ జరిగినదని, ఆ పాదంపై ఏకాభిప్రాయానికి వచ్చిన్నట్లు డా. అంబెడ్కర్ కూడా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. `సమాఖ్య లౌకిక సామ్యవాద రాష్ట్రాల కూటమి’ అనే పదం చేర్చాలని కె టి షా సూచించగా అంబెడ్కర్ స్పష్టంగా తిరస్కరించారని చెప్పారు. కాలానుగుణంగా,మారిని పరిస్థితులను పరిగణలోకి తీసుకొని విధానాలలో కూడా మార్పులు చేసుకొంటూ పోవాలని రాకేష్ సిన్హా సూచించారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Remove the word socialism in the constitution
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com