Red Chilli Record Price: మిర్చికి మంచి ధర పలుకుతోంది. ఇన్నాళ్లు ధర లేదని బాధ పడిన రైతులకు మిర్చి ఘాటు ధర పలుకుతూ వారిలో ఆశ్చర్యాన్ని నింపుతోంది. కొన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చిన ధర ఏకంగా అమాంతం పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతుల కష్టాలు తీరేలా ధర రూ.52 వేల కు చేరడం రైతుల మోముల్లో చిరునవ్వు కురిపిస్తోంది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చికి రూ. 52 వేల ధర పలకడంతో అందరు ముక్కున వేలేసుకున్నారు.
గతంలో మిరప పంట వేసిన వారికి నష్టాలే మిగిలాయి. ఇప్పుడు మాత్రం రికార్డు స్థాయిలో ధర పలకడంతో దేశంలోనే ఇది ఆల్ టైం రికార్డు ధర అని చెబుతున్నారు. ఇప్పటి వరకు దేశ చరిత్రలోనే మిర్చికి ఇంత ధర పలకడం ఇదే ప్రథమం అని తెలుస్తోంది. దీంతో రైతుల కష్టాలు తీరేలా ఉన్నాయి. సిరులు కురిపించే వీలుంది. మిర్చి పంట సాగుకు ఇక రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read: AP New Disticts: ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఇవే.. 4వ తేదీ నుంచే అమలు.. ఫుల్ డీటైల్స్
అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మిర్చికి కూడా ధర పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పెరిగి రైతులకు బంగారం కురిపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బంగారంతో సమానంగా మిర్చికి కూడా భారీ ధర పలకడం రైతుల కష్టానికి ఇక మంచి రోజులు వచ్చినట్లేనని చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా రూ. 40 వేల నుంచి రూ.52 వేలకు పెరగడంతో రైతులకు సంతోషం కలుగుతోంది. దేశీ మిర్చితోపాటు సింగిల్ పట్టి రకానికి కూడా రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఈ సంవత్సరం రైతులకు భారీ లాభాలు కలగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిర్చి పంట వేసేందుకు పలువురు రైతులు ముందుకు రానున్నట్లు సమాచారం. వాణిజ్య పంటకు గిరాకీ ఏర్పడటంతో ఇక రైతులకు సాగుకు భయం లేదని తెలుస్తోంది. భవిష్యత్ లో వాటిని సాగు చేసినా నష్టం రాకుండా ఉంటుందనే భరో సా కలగనుంది.
మిర్చి పంటకు రికార్డు స్థాయిలో ధర పలకడం నిజంగా విశేషమే. ఇంత భారీ ధర రావడంతో రైతులు పండించిన పంటతో పాటు లాభాలు కూడా వారి దరి చేరాయి. ఈ నేపథ్యంలో మిర్చి పంటకు మరికొంత కాలం లాభాలు రావచ్చని తెలుస్తోంది.