https://oktelugu.com/

NTR Koratala Siva Movie: ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం.. కారణం అదే

NTR Koratala Siva Movie: జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం కొంచెం లావు పెరిగారు. అయితే, తాజాగా తారక్ బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం తారక్ కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అందుకే.. ఈ సినిమా కథ కోసం తాను 8 కేజీలు తగ్గాలని కసరత్తులు చేస్తున్నాడు. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 30, 2022 / 03:40 PM IST
    Follow us on

    NTR Koratala Siva Movie: జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం కొంచెం లావు పెరిగారు. అయితే, తాజాగా తారక్ బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం తారక్ కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, తనకిష్టమైన త్రివిక్రమ్ సినిమాను కూడా వదులుకున్నాడు. కొరటాల చెప్పిన కథ, ఎన్టీఆర్ కి అంత గొప్పగా నచ్చింది. అందుకే.. ఈ సినిమా కథ కోసం తాను 8 కేజీలు తగ్గాలని కసరత్తులు చేస్తున్నాడు.

    NTR Koratala Siva Movie

    ఇందుకోసం స్పెషల్ ట్రైనర్‌ను సైతం రిక్రూట్ చేసుకున్నాడట. ఈ సినిమాలో తారక్ లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుందని తెలుస్తోంది. జూన్‌ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో పాత్ర ఉందట. అయితే, ఆ పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోని తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ కి సినిమాలో అది బాబాయ్ పాత్ర అట.

    Also Read: Celebrities Chose Surrogacy Parenthood: స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల్ని క‌న్న సెల‌బ్రిటీలు వీరే.. టాలీవుడ్ లో ఎవ‌రెవ‌రంటే..?

    వెరీ ఎమోషనల్ గా ఉండే ఆ పాత్రలో హీరో రాజశేఖర్ అయితే ఎలా ఉంటుంది ? అంటూ కొరటాల ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కొరటాల ఆలోచనను ఎన్టీఆర్ కూడా అంగీకరిస్తే.. రాజశేఖర్, ఎన్టీఆర్ కి బాబాయ్ గా నటించడం ఖాయం. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు.

    ఒకవేళ ఆ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అయితే.. సినిమా మార్కెట్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అని కొరటాల కూడా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు హిందీలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుంది. మరి కొరటాల హిందీలో ఏ స్టార్ హీరోని ఒప్పిస్తాడో చూడాలి. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    NTR Koratala Siva Movie

    అన్నట్టు ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేసారు. పైగా జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటి పక్కనే ఓ పెద్ద సెట్ వేశారు. సినిమాలో ఎక్కువ భాగం ఈ సెట్ లోనే ఉంటుందట. ఎన్టీఆర్ కి చాలా టైం కలిసివస్తుందని కొరటాల శివనే స్వయంగా ఇలా అక్కడ సెట్ వేశామని చెప్పుకొచ్చాడు.

    Also Read:Nithin Macherla Niyojakavargam: బర్త్ డే నాడు కత్తి పట్టి వెంటాడిన హీరో ‘నితిన్’

    Tags