ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య వెనుక కారణమేంటీ?

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాలు వెల్లడయ్యాక పలువురు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయంగా మారింది. ఫెయిల్ అయ్యామని కొందరు.. తక్కువ మార్కులొచ్చాయని మరికొందరు బలవర్మణానికి పాల్పడటం ఆందోళనను రేకెత్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. విమర్శించిన నోటితోనే జై కొట్టించుకున్న కేసీఆర్..! తెలంగాణ ఇంటర్మీయట్ బోర్డు శుక్రవారం పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ప్రతియేటాలాగే కొంతమంది విద్యార్థులు ఫెయిల్ కాగా మరికొందరు అత్యవసర […]

Written By: NARESH, Updated On : June 20, 2020 1:16 pm
Follow us on


తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాలు వెల్లడయ్యాక పలువురు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయంగా మారింది. ఫెయిల్ అయ్యామని కొందరు.. తక్కువ మార్కులొచ్చాయని మరికొందరు బలవర్మణానికి పాల్పడటం ఆందోళనను రేకెత్తిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

విమర్శించిన నోటితోనే జై కొట్టించుకున్న కేసీఆర్..!

తెలంగాణ ఇంటర్మీయట్ బోర్డు శుక్రవారం పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ప్రతియేటాలాగే కొంతమంది విద్యార్థులు ఫెయిల్ కాగా మరికొందరు అత్యవసర మార్కులతో పాస్ అయ్యారు. ఈ ఫలితాల్లో ఫెయిల్ విద్యార్థులు, తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులు మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సిద్దిపేట, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురు ఇంటర్మీయట్ విద్యార్థులు బలవర్మాణానికి పాల్పడటంతో ఆయా జిల్లాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.

ఇందులో నాగర్ కర్నూల్ కు చెందిన కల్వకోల్ గ్రామానికి చెందిన సోని ఇంటర్మీయట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫస్టియర్ ఫలితాల్లో సోనికి తక్కువ మార్కులొచ్చాయి. తాను బాగా చదివినా కూడా మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపంతో పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా చెంద్రుగూడెంకు చెందిన సోలం సరుయు మూడు సబ్జెక్టుల్లో ఫెలవడంతో ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా భజ్యానాయక్ తండాకు చెందిన నిఖిత, సిద్దిపేట జిల్లా క్యాసారం గ్రామానికి చెందిన శ్రావణి, గజ్వేల్ పట్టణానికి చెందిన అభి పరీక్షల్లో ఫెయిలవడంతో ఉరి వేసుకొని ఆత్మహత్యలకు పాల్పడటం శోచనీయంగా మారింది.

హంకాంగ్, తైవాన్ లో శ్రీరాముడి ఫొటో వైరల్.. ఎందుకంటే?

రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానం సరైనదేనా? అనే చర్చ నడుస్తుంది. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులే ప్రధానం అనే రీతిలో విద్యావ్యవస్థ మారడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైనా ఇతర రంగాల్లో రాణించవచ్చని.. ఫెయిలయినంత మాత్రనా ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యార్థులకు జీవితంపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్య మన విద్యావ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపుతుందని విద్యావేత్తలు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత విద్యావ్యవస్థను మార్చే దిశగా ఆలోచించాలని నిపుణులు కోరుతున్నారు.