ఆధిపత్య పోరు: కిషన్ రెడ్డి వర్సెస్ బండి

బీజేపీలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని అధిష్టానం ఎప్పుడో రూఢీ చేసింది. ఒక చాయ్ వాలాను దేశానికి ప్రధానిని చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలి తెలంగాణ గవర్నర్ ను చేసింది.. పార్టీ కోసం పరితపించిన మన దత్తన్నను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పంపింది. తెలంగాణ బిడ్డ విద్యాసాగగర్ రావు ఏకంగా దేశంలో పెద్ద రాష్ట్ర మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఇప్పుడే అదే బాటలో తెలంగాణలో ఒక బీజేపీ కౌన్సిలర్ గా చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఏకంగా తెలంగాణ […]

Written By: NARESH, Updated On : June 20, 2020 12:18 pm
Follow us on


బీజేపీలో సామాన్యులకు న్యాయం జరుగుతుందని అధిష్టానం ఎప్పుడో రూఢీ చేసింది. ఒక చాయ్ వాలాను దేశానికి ప్రధానిని చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలి తెలంగాణ గవర్నర్ ను చేసింది.. పార్టీ కోసం పరితపించిన మన దత్తన్నను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పంపింది. తెలంగాణ బిడ్డ విద్యాసాగగర్ రావు ఏకంగా దేశంలో పెద్ద రాష్ట్ర మహారాష్ట్ర గవర్నర్ అయ్యారు. ఇప్పుడే అదే బాటలో తెలంగాణలో ఒక బీజేపీ కౌన్సిలర్ గా చేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఏకంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. నమ్ముకున్న వారికి.. కష్టపడ్డ వారికి బీజేపీలో అందలం దక్కుతుందని ఎన్నో సార్లు రుజువైంది.

విమర్శించిన నోటితోనే జై కొట్టించుకున్న కేసీఆర్..!

అయితే తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ కు అంతా పూలపాన్పుగా ఏమీ లేదు. ముళ్ల నడక ముందుంది. తలపండిన సీనియర్ బీజేపీ నేతల ముందు బండి నడక తడబడుతోంది. వారిని ఎదురించేలేక.. స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోలేక ఆయన తటపటాయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ బీజేపీలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు లక్ష్మన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నీ తానై వ్యవహరించిన కిషన్ రెడ్డి.. ఆయన స్థానంలో బండి సంజయ్ రాగానే ఆయన దూకుడు యవ్వారంతో పార్టీపై తన ప్రభావం తగ్గకుండా చూసుకుంటున్నారన్న ప్రచారం కమలనాథుల్లో వ్యక్తమవుతోంది.

బీజేపీ చర్యలకు… పవన్ జవాబుదారు కాదా?

ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ జిల్లా అధ్యక్షులను నియమించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు నియమించారు. అయితే తమ ఆధిపత్యం పోతుందని బీజేపీ సీనియర్లు అంతా కూడబలుక్కున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్రసహాయ మంత్రి కిషన్ రెడ్డి రంగ ప్రవేశం చేసి హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగా ఫైర్ బ్రాండ్ బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పేరును తెరపైకి తీసుకొచ్చారట.. దీనికి బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మన్ సహా అందరి సపోర్టు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నాయి.

అయితే హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఒక్కరి చేతిలో పెడితే బాగుండదని.. అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ ను నాలుగు భాగాలుగా చేసి నలుగురిని బీజేపీ అధ్యక్షులుగా చేయాలని తద్వారా పోరాటం.. నిరసనలు, పార్టీలో అవకాశాలు ఇచ్చినట్టు అవుతుందని ఈ ప్లాన్ చేశారట..

రెబల్ ఎమ్మెల్యేలపై టీడీపీ చర్యలు తీసుకుంటుందా?

కానీ కిషన్ రెడ్డి మాత్రం రాజాసింగ్ నే హైదరాబాద్ అధ్యక్షుడిని చేయాలని పట్టుబడుతుండడంతో బీజేపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయట.. బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందనేది బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.