https://oktelugu.com/

జగన్ బాటలోనే సీఎం కేసీఆర్?

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రోజురోజుకు కరోనా కేసులు తెలంగాణలో భారీగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్నిరోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్యగా భారీగా పెరిగిపోతుంది. కరోనా కట్టడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కంట్రోల్ కావడంలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవల పెరుగుతున్న కేసుల సంఖ్య చేస్తుంటే కేసీఆర్ సర్కార్ కరోనా విషయంలో చేతులేత్తిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏపీలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా ప్రభుత్వం టెస్టులను సంఖ్య భారీగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 20, 2020 / 01:58 PM IST
    Follow us on


    తెలంగాణలో కరోనా ఉగ్రరూపం చూపుతోంది. రోజురోజుకు కరోనా కేసులు తెలంగాణలో భారీగా నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్నిరోజులుగా తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్యగా భారీగా పెరిగిపోతుంది. కరోనా కట్టడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కంట్రోల్ కావడంలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవల పెరుగుతున్న కేసుల సంఖ్య చేస్తుంటే కేసీఆర్ సర్కార్ కరోనా విషయంలో చేతులేత్తిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    మరోవైపు ఏపీలో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా ప్రభుత్వం టెస్టులను సంఖ్య భారీగా చేస్తోంది. అదేవిధంగా ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మూడు జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనూ కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

    ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య వెనుక కారణమేంటీ?

    తెలంగాణలో శుక్రవారం ఏకంగా 499 కొత్త కేసులు నమోదవడం చూస్తుంటే వైరస్ ఎలా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 499 కేసులు నమోదుగా కాగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 329కేసులు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 6,526కరోనా కేసులు నమోదుకాగా 198కరోనాతో మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 4,526కు చేరాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో హైదరాబాద్లో 50వేల కరోనా టెస్టులను చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు ప్రైవేటు ల్యాబ్లో కరోనా టెస్టులకు అనుమతి ఇచ్చింది.

    ఆధిపత్య పోరు: కిషన్ రెడ్డి వర్సెస్ బండి

    గత నెలక్రితం వరకు తెలంగాణలో వైరస్ కట్టడిలోనే ఉండేది. యాభై.. వందల్లోనే కేసులు నమోదయ్యేవి. అయితే గడిచిన వారం పదిరోజులుగా తెలంగాణలో రోజుకు మూడొందలు, నాలుగొందల కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన కరోనా కంట్రోల్లోకి రాకపోవడంతో క్షేత్రస్థాయిలో అధికారులు సక్రమంగా పని చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతోన్నాయి. మరోవైపు ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రకాశం, అనంతపురం. శ్రీకాకుళం జిల్లాల్లో లాక్డౌన్ విధిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

    ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని తెలంగాణ మంత్రులు గతంలోనే ఖండించారు. అయితే తాజాగా తెలంగాణలో మహమ్మరి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!