
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పథకంతో ప్రజలపై భారంపడుతోంది. దీంతో అన్నివర్గాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఎల్ఆర్ఎస్ తో తెలంగాణలో రియల్టరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: వాహనదారులకు అదిరిపోయే శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్ గడువు పొడిగింపు..?
ఈక్రమంలోనే తెలంగాణ రియల్టర్లంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణ రియల్టర్ల అసోసియేషన్ సభ్యులు ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్.. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశారు.
తెలంగాణ సర్కార్ ప్రజలపై అన్యాయం ఎల్ఆర్ఎస్ భారాన్ని రద్దు చేసుకోవాలని తాము చేయబోతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు రేవంత్ ను కోరారు.
టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనలో రాష్ట్రంలోని వేల గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లు వేశారని.. వీటికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చి రిజిస్ట్రేషన్లు కూడా చేసిందని రేవంత్ కు తెలిపారు.
Also Read: వ్యవసాయ చట్టాలపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
ఒక్కో ప్లాటు ఇప్పుడు పలువురి చేతులు మారిందని.. ఆ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కడితేనే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తామనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ సర్కార్ ఎల్ఆర్‌ఎస్ రద్దు చేయకుంటే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓట్లే వేయద్దని ప్రైవేటు ఉద్యోగులు.. విద్యావంతులను కోరుతామని వారు చెప్పారు.
ఇక ఈనెల 29న తాము చేపట్టబోయే హైవేల దిగ్బంధన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని రేవంత్ ను కోరారు. రేవంత్ సైతం వారికి మద్దతు తెలిపి రియల్టర్లు చేపట్టబోయే ఆందోళనలో పాల్గొంటానని హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్