
టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యే రోజానగరి ఎమ్మెల్యే రోజా టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ భూస్థాపితం అయితేనే తప్ప రాష్ట్రానికి మంచి రోజులు రావని అన్నారు. ఆదివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన రోజా.. పేదలకు ఇచ్చే ఇళ్లను సైతం అడ్డుకుంటున్నారంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. ‘అడ్డంగా పడుకుంటే ఇల్లు చాలదని అచ్చెన్నాయుడు అంటున్నారు.. బలిసిన వాళ్లుకు కాదు.. బలహీనవర్గాలకు ప్రభుత్వం ఇళ్లు ఇస్తోంది’ అని రోజా వ్యాఖ్యానించారు. ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు అభినందించకపోయినా పర్వలేదు కానీ, బురద మాత్రం చల్లొద్దని హితవు చెప్పారు.