దేశ వ్యాప్తంగా కరోనా విజృంభన కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి మే 3 వరకు ఉచితంగా ఇంటర్నెట్ పొందొచ్చు అనే వార్త వైరల్ గా మారింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ప్రజలకు అనేక సౌకర్యాలు, సదుపాయాలు, ఉచిత సర్వీసుల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు అదనంగా డేటాను అందిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఉచిత సేవల్ని అందిస్తున్నాయి. అయితే వీటిపై అనేక తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఎస్ఎంఎస్, వాట్సప్ మెసేజెస్, సోషల్ మీడియా పోస్టుల్లో ఎక్కువగా ఇవే కనిపస్తున్నాయి. వాటిని ప్రజలు నమ్ముతున్నారు. నిజమని అనుకుంటున్నారు. అలాంటిదే ఈ మెసేజ్ కూడా. భారత ప్రభుత్వ తెలికాం శాఖ 2020 మే 3 వరకు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తుంది అన్న మెసేజ్ వాట్సప్ లో చక్కర్లు కొడుతోంది. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తోందన్నది ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు… ఆ మెసేజ్ లో ఓ లింక్ కూడా ఉంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఉచితంగా ఇంటర్నెట్ పొందొచ్చని మెసేజ్ లో వివరించడం విశేషం. కానీ ఇదంతా అబద్ధం.
ఆ లింక్ ని క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలు అడిగి ఆ ఒక టెక్స్ట్ మెసేజ్ మీ మొబైల్ కి వస్తుంది. ఆ మెసేజ్ లో “కంగ్రాట్స్… మరో 24 గంటలలో మీకు ఉచిత ఇంటర్నెట్ పొందుతారు” అని ఉంటది. ఆ తర్వాత 24 గంటలు, 48గంటలు,72 గంటలకైనా ఆ ఇంటర్నెట్ డేటా మీకు రాదు. కాబట్టి ఆ ఉచిత ఇంటర్నెట్ మెసేజ్ అబద్ధం అని తేలిపోయింది.