స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి

నిన్నే లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మృతితో షాక్ లో ఉన్న బాలీవుడ్ కి మరో దుర్వార్త. 80 వ దశకంలో యూత్ ఐకాన్ గా పేరుబడ్డ రిషి కపూర్ నేడు ముంబై లో కాన్సర్ కి చికిత్స తీసుకొంటూ మరణించడం జరిగింది. 1973 లో “బాబీ ” చిత్రం తో హీరో గా సినీ రంగ ప్రవేశం చేసిన రిషి కపూర్ , తొలి చిత్రం అఖండ విజయం తో యూత్ కి హాట్ ఫేవరేట్ […]

Written By: admin, Updated On : April 30, 2020 12:25 pm
Follow us on


నిన్నే లెజెండరీ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మృతితో షాక్ లో ఉన్న బాలీవుడ్ కి మరో దుర్వార్త. 80 వ దశకంలో యూత్ ఐకాన్ గా పేరుబడ్డ రిషి కపూర్ నేడు ముంబై లో కాన్సర్ కి చికిత్స తీసుకొంటూ మరణించడం జరిగింది. 1973 లో “బాబీ ” చిత్రం తో హీరో గా సినీ రంగ ప్రవేశం చేసిన రిషి కపూర్ , తొలి చిత్రం అఖండ విజయం తో యూత్ కి హాట్ ఫేవరేట్ గా మారిపోయాడు . బాబీ తరవాత ఆయన ” జిందా దిల్ , రఫు చక్కర్ , ఖేల్ ఖేల్ మే , లైలా మజ్ను , సర్గం ,చాందిని , నసీబ్ , కర్జ్ , నగినా, ప్రేమ్ రోగ్ ” వంటి అనేక లవ్ స్టోరీస్ లో తనదైన ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచిపోయాడు .

ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రిషి కపూర్ అస్వస్థతకు గురికావడంతో నిన్న ఆయన్ని ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో చేర్చారు. సడన్ గా ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ అమెరికాలో చాలా కాలం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. దాంతో కొంత కోలుకొన్నట్టు కనిపించిన ఆయన సడన్ గా ఇలా కన్ను మూయాల్సి వచ్చింది . ఆయన మృతికి బాలీవుడ్ నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ కనీసం కడసారి చూపుకు నోచుకోలేక పోతునందుకు తీవ్ర భాదను వ్యక్తం చేయడం జరిగింది .