మీడియాపై మోడీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నారా?

దేశంలో బీజేపీని తిరుగులేని శక్తిగా మలచడానికి ప్రధాని నరేంద్రమోడీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఒకప్పుడు కాంగ్రెస్ ను ఓడించడానికి ఆపసోపాలు పడిన బీజేపీని ఎవరి మద్దతు లేకుండా పూర్తి మెజార్టీతో గద్దెనెక్కించిన మోడీ ఇప్పుడు మరింత బలంగా తయారు చేయడానికి రెడీ అయ్యారని ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను కుదేలు చేయడంతోపాటు మీడియాపై కూడా సర్జికల్ స్ట్రైక్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. Also Read: ఆ విషయంలో మోదీని ఫాలో అవుతున్న […]

Written By: NARESH, Updated On : July 26, 2020 12:02 pm
Follow us on


దేశంలో బీజేపీని తిరుగులేని శక్తిగా మలచడానికి ప్రధాని నరేంద్రమోడీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఒకప్పుడు కాంగ్రెస్ ను ఓడించడానికి ఆపసోపాలు పడిన బీజేపీని ఎవరి మద్దతు లేకుండా పూర్తి మెజార్టీతో గద్దెనెక్కించిన మోడీ ఇప్పుడు మరింత బలంగా తయారు చేయడానికి రెడీ అయ్యారని ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ను కుదేలు చేయడంతోపాటు మీడియాపై కూడా సర్జికల్ స్ట్రైక్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

Also Read: ఆ విషయంలో మోదీని ఫాలో అవుతున్న కేసీఆర్

ఇప్పటికే శత్రుదేశం పాకిస్తాన్ ఆగడాలపై సర్జికల్ స్ట్రైక్ చేసి బుద్ది చెప్పిన మోడీ ఇప్పుడు బీజేపీకి శాశ్వతంగా అధికారం కోసం దేశంలోని వ్యతిరేకమైన మీడియాను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఇందుకోసం ఒక విభాగాన్ని రెడీ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా మీడియాను విభజించడానికి మోడీ ప్లాన్ చేసినట్లు తెలిసింది.

తాజాగా జాతీయంగా బీజేపీకి అనుకూలమైన మీడియా ఇటీవల కేంద్ర సమాచార… ప్రసారశాఖ మంత్రిని కలుసుకున్నారు. అనేక సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలోనే దేశంలోనే మీడియాకు అత్యున్నత సంస్థ అయిన ‘ఎడిటర్స్ గిల్డ్’ నుంచి విడిపోవాలని బీజేపీ అనుకూల అగ్ర మీడియా సంస్థలు నిర్ణయించినట్లు సమాచారం.

Also Read: చైనా మరో బయో వెపన్.. పాక్ లో తయారీ?

వామపక్ష అనుకూలంగా.. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎడిటర్స్ గిల్డ్ నుంచి విడిపోయి ‘నేషనలిస్ట్ ఎడిటర్స్ గిల్డ్’ను ఏర్పాటు చేయాలని బీజేపీ అనుకూల మీడియా నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామితో సహా 20 మంది ప్రముఖ వ్యక్తులు జాతీయ అనుకూల సంస్థలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. వీరికి కేంద్రంలోని సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ నుంచి ప్రభుత్వం పూర్తి స్థాయి మద్దతు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది.

దీన్ని బట్టి బీజేపీ అనుకూల మీడియా.. వ్యతిరేక మీడియాను విడగొట్టే ప్రయత్నం మొదలైంది. దేశంలో వ్యతిరేకత మీడియాను లేకుండా చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. వారికి నిధులు.. విధులు.. ప్రాధాన్యత లేకుండా చేయాలని చూస్తోంది. తద్వారా వ్యతిరేకత వ్యాపించకుండా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మీడియాపై సర్జికల్ స్ట్రైక్ గా అభివర్ణిస్తున్నారు.

-ఎన్నం