ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. తిమ్మిని బమ్మి చేయడంలో బమ్మిని తిమ్మి చేయడం కూడా ప్రభుత్వానికి ప్రత్యేక ఉందని తెలుస్తోంది. అధికారుల సహకారం ఉండాలే కానీ మనకు ఢోకా ఉండదని తెలుసు. నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా సాధించుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ర్టంలో ఆహార భద్రత కార్డుల జారీ చేస్తోంది. ఇందులో నిబంధనలు సైతం తుంగలో తొక్కుతోంది. తమకు అనుకూలంగా ఉన్న వారికి ఏ విధంగానైనా అందజేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇందులో ప్రభుత్వమే పెద్దన్న పాత్ర పోషించిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో లోపాయకారి ఒప్పందాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలోని నందిపేట మండలంలో అధికారులు చిన్న పిల్లల పేరు మీద రేషన్ కార్డులు జారీ చేశారు. కార్లు, ఆస్తులు ఉంటే కార్డులు రావనే భయంతో చిన్న పిల్లల పేర్ల మీద దరఖాస్తు చేసుకున్నారు. తిరస్కరించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా జారీ చేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయ.
దరఖాస్తులు తీసుకున్న అధికారులు అర్హత లేదని కార్డులు మంజూరు చేయొద్దని సూచించినా స్థానిక నేతల పైరవీలతో రేషన్ కార్డుల జారీ పూర్తి చేయించుకున్నారు. 22 మంది పిల్లల పేరు మీద కార్డులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అని సందేహాలు వస్తున్నాయి.
రేషన్ కార్డుల జారీ జులై 26 నుంచి 31 వరకు రాష్ర్టవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఆగస్టు నెల నుంచి వీరికి బియ్యం సైతం కేటాయించనున్నారు. రేషన్ కార్డుల పారదర్శకత విషయంలో సంబంధిత శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఏ చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. రేషన్ కార్డుల జారీలో అవకతవకలు చోటు చేసుకుంటున్న ఘటనలు రాష్ర్ట వ్యాప్తంగా వెలుగు చూడడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.