Hari Hara Veeramallu : సుమారుగా 5 ఏళ్ళ నుండి సెట్స్ మీద ఉన్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మే 9 న విడుదల అయ్యేందుకు లైన్ మొత్తం క్లియర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన డేట్స్ కూడా ఇటీవలే ఖరారు అయ్యాయి అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఏప్రిల్ 14 లోపు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలోని తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వారంలోనే ఆయన షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. అందుకు సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన వెన్ను నొప్పి ట్రీట్మెంట్ కోసం గత కొద్దిరోజుల నుండి హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఏప్రిల్ 15 లోపు VFX విభాగానికి సంబంధించిన వర్క్ మొత్తం కూడా పూర్తి అవుతుందని తెలుస్తుంది.
Also Read : అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరో అవ్వాలంటే ఇదొక్కటే దారి…
ఏప్రిల్ 10 వ తేదీన మూడవ పాటని విడుదల చేస్తారని, ఏప్రిల్ 15 న నాల్గవ పాటని వదులుతారని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా తెలియచేయనున్నారు మేకర్స్. ఏప్రిల్ 20 వ తారీఖున సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేయడానికి స్లాట్ కూడా బుక్ చేసుకున్నారట. ఎలాగో హైదరాబాద్ లోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, ఆయనకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాని ఐమాక్స్ వెర్షన్ లో కూడా విడుదల చేస్తున్నారు. అందుకు సంబంధించిన వర్క్ ఏప్రిల్ 22 కి పూర్తి అవుతుందట. త్వరలో విడుదల కాబోయే రెండు పాటల్లో ఒకటి మాస్ సాంగ్ ఉంటుందని సమాచారం. అదే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ నెల 19 వ తేదీ నుండి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్ వర్క్ ని మొదలు పెట్టబోతున్నాడట. ఏప్రిల్ 23 వ తారీఖు నుండి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంబిస్తారట.
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 20 VFX కంపెనీలు ఈ చిత్రం కోసం పని చేస్తున్నాయట. ఇప్పటి వరకు 5 కంపెనీలకు సంబంధించిన VFX వర్క్ పూర్తి అయ్యిందని, మిగిలిన కంపెనీలు 10 నుండి 15 రోజుల్లో VFX కంటెంట్ ని డెలివరీ చేస్తారని తెలుస్తుంది. ఓవరాల్ గా అభిమానుల ఎదురు చూపులకు ఎట్టకేలకు తెరపడబోతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని మే2వ తేదీన విడుదల చేయబోతున్నారట. ఒక సినిమా ఓపెనింగ్ స్థాయి ని నిర్ణయించేది కేవలం థియేట్రికల్ ట్రైలర్ మాత్రమే. మరి ‘హరి హర వీరమల్లు’ ఏమేరకు అభిమానుల్లో ట్రైలర్ ద్వారా అంచనాలను పైకి లేవుతుందో చూడాలి. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ లో మొదటి రెండు గ్లిమ్స్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక రీసెంట్ గా విడుదల చేసిన ‘కొల్లగొట్టినాదిరో’ చార్ట్ బస్టర్ గా నిల్చింది.
Also Read : నా సినిమాలు చూడకండి..బ్యాన్ చేయండి – నిర్మాత నాగ వంశీ