
టైటానిక్ శిథిలాలను అన్వేషించడానికి 1986లో సముద్రంలోకి వెళ్లాడు. ఆ డైవ్ డౌన్ తీసిన మొత్తం వీడియో కొత్త ఫుటేజ్ ను బుధవారం సాయంత్రం విడుదల చేస్తున్నారు. 80 నిమిషాల అన్‌కట్ వీడియో ఇప్పుడు చూడడానికి అందరూ సిద్ధం కండి. వుడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఇన్‌స్టిట్యూషన్ ద్వారా WHOI యొక్క య్యూటూబ్ ఛానెల్ లో రాత్రి 7:30 గంటలకు అప్‌లోడ్ చేయబడుతుంది. ఏప్రిల్ 1912లో సుమారు 1,500 మంది ప్రయాణికులు మరణించిన టైటానిక్ మునిగిపోయిన తర్వాత కొన్ని మునుపెన్నడూ చూడని చిత్రాలను సేకరించారు. వాటిని బుధవారం విడుదల చేస్తున్నారు.
టైటానిక్ తన తొలి ప్రయాణంలో ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి బయలుదేరింది. అయితే ఓడ మంచుకొండను ఢీకొని అట్లాంటిక్ మహాసముద్రంలోని న్యూఫౌండ్‌లాండ్ తీరంలో మునిగిపోయింది. దాదాపు 80 సంవత్సరాల తర్వాత 1985లో WHOI మరియు ఒక ఫ్రెంచ్ సముద్ర శాస్త్ర అన్వేషణ సంస్థ బృందం 12,000 అడుగుల దిగువన నౌకను కనుగొన్నారు.
జేమ్స్ కామెరూన్ అకాడమీ అవార్డు గెలుచుకున్న చిత్రం “టైటానిక్” 25వ వార్షికోత్సవం సందర్భంగా 1986లో ఓడ యొక్క శిథిలాలను అన్వేషించిన ముగ్గురు వ్యక్తుల డైవ్ బృందం నుండి ఫుటేజ్ బుధవారం ప్రజలకు విడుదల చేయనున్నారు. “టైటానిక్ మునిగిన ఒక శతాబ్దం తర్వాత ఈ గొప్ప ఓడలో మూర్తీభవించిన మానవ కథలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి” అని కామెరాన్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు.
టైటానిక్‌లోని ఆవిష్కరణల ద్వారా తాను ఎంతో ఉద్వేగానికి గురయ్యానని.. ఈ వీడియో ఫుటేజ్ “తరతరాలుగా విస్తరించి ప్రపంచాన్ని చుట్టే కథలో ఒక ముఖ్యమైన భాగాన్ని చెప్పడానికి సహాయపడుతుందని కామెరూన్ చెప్పాడు.
అభిరుచి గల ఒక టైటానిక్ చరిత్రకారుడు మాట్లాడుతూ.. “టైటానిక్ అనేది అటువంటి ఒక గొప్ప దృగ్విషయం, దాని నుండి మీరు పొందగలిగే ఏదైనా కొత్త సమాచారం అయినా తక్షణమే ఆసక్తిని కలిగిస్తుంది. ఇది సముద్రంలో జరిగే రహస్యాలలో ఒకటి, ఇది ఇప్పటికే రహస్యంగా ఉంది. ఇప్పుడు బయటపడుతోంది” అని ఈ వీడియో కోసం ఆసక్తిగా చూస్తున్నట్టు పేర్కొన్నాడు.
టైటానిక్ మునిగిన ఒక 100 ఏళ్ల తర్వాత అప్పటి ఫుల్ వీడియో ఇప్పుడు బయటకు రాబోతుండడంతో అది ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.