ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో కరోనా వైరస్ జాడ ఉండబోదని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తబ్లిగ్ జమాత్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారితో కొత్తగా 200 కు పైగా కేసులు రావడంతో ఖంగు తిన్నా, పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
ఏప్రిల్ 14 తర్వాత దేశంలో లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం సడలిస్తే, తెలంగాణలో కూడా అమలు పరచడం కోసం కేసీఆర్ సిద్దపడుతున్నారు. ఈ లోగా తబ్లిగ్ జమాత్ నుండి వచ్చిన వారున్న ప్రాంతాలను గుర్తించి, వాటిని హాట్ స్పాట్ లుగా ప్రకటించి, ఆ ప్రాంతలాల్ ఓప్రతి ఇంతా కరోనా టెస్ట్ ను నిర్వహించడం ద్వారా ఈ ఉపద్రవంను చాలావరకు కట్టడి చేయడం కోసం వ్యూహరచన చేశారు.
మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్లు రాష్ట్రంలో సుమారు వంద మందికి వైరస్‌ను అంటించారు. ఇందులో అధికశాతం కుటుంబ సభ్యులే ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల ఇతరులకూ వైరస్ వ్యాపించింది. ర్కజ్‌లో పాల్గొన్నవారు, మార్చి 17 నుంచి 21 మధ్య వివిధ రైళ్లలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారు.
వీళలో 160 మందికి వైరస్ ఉన్నట్టు తేలింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ , నిజామాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో వైరస్ కేంద్రాలను గుర్తిస్తున్న ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కరోనా టెస్టులు చేయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఈ నెల 14 నాటికి ఈ టెస్ట్ లను పూర్తి చేయనున్నారు. ఒక వేల పూర్తి కానీ పక్షంలో వరకే టెస్టులు పూర్తిచేయాలని భావిస్తోంది. లేదంటే, టెస్టులు పూర్తయ్యేవరకూ ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కొనసాగించే అవకాశం ఉంది.
ఇక తక్కువ కేసులున్న ప్రాంతాల్లో పాజిటివ్ వ్యక్తులున్న ఇళ్లకు మూడు కిలోమీటర మేర హాట్ స్పాట్‌గా ప్రకటించి కంటైన్మెంట్ ప్రణాళికను అమలు చేయనున్నట్టు తెలిసింది. ఈ ఏరియాల్లో ఇంటింటికి వెళ్లి లక్షణాలున్న వారికి ర్యాపిడ్ టెస్ట్‌లు చేయనున్నారు.
కరోనా పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం జరుపుతున్న పరీక్షల ఫలితాలు రావడానికి ఐదారు గంటల సేపు పట్టడమే కాకుండా, అందుకు అవసరమైన కిట్ల లభ్యత కూడా తక్కువగా ఉంది. దానితో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్ట దలచిన హాట్‌స్పాట్ ప్రాంత ప్రజలు, అనుమానితులకు ర్యాపిడ్ డయాగ్నసిస్ టెస్ట్ (ఆర్డీటీ) ద్వారా పరీక్షా చేయాలని నిర్ణయించింది.
ఈ పద్దతిలో ఐదు నిముషాలలో అక్కడికక్కడే ఫలితాలు రాగలవు. తొలుత అనుమానితుల రక్తాన్ని పరీక్షించి, కరోనా ఉన్నదీ లేనిదీ ప్రాథమికంగా నిర్థారిస్తారు. ఐదు, పది నిమిషాల్లోనే ఈ టెస్ట్ ఫలితం వచ్చేస్తుందని అధికారులు చెబుతున్నారు. 4 లక్షల టెస్టింగ్ కిట్లను ఆర్డర్ చేశామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.