Punishment For Rape: మనదేశలో చట్టాలెన్నో ఉన్నాయి. కానీ వాటిని తమకు అనుకూలంగా మలుచుకునే మహామహులు ఉన్నారు. దీంతో నేరం చేసినా వారికి శిక్షలు పడకుండా ఉండేందుకు తమకు అవసరమైన పాయింట్లు వెతుక్కుని బయటపడుతున్నారు. దీంతో నేరం చేసినా కోర్టు మనకు అండగా ఉంటుంది లే అనే వాదనే ఎక్కువగా వస్తోంది. దీంతో నేరస్తులు శిక్షలు అనుభవించకుండా చట్టంలోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దేశంలో ఎన్నో కేసుల్లో శిక్షలు పడకుండా బయటకు వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. మైనర్ల విషయంలో కూడా ఎన్నో చట్టాలున్నా అవి చచ్చుబండలే అవుతున్నాయి.

బాలిక ఇష్టంతో సెక్స్ లో పాల్గొన్నా అది అత్యాచారంగానే పరిగణించాల్సి వస్తోంది. దీంతో ఆమెతో శృంగారంలో పాల్గొన్న వ్యక్తికి పదేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. కొన్ని సార్లు రెండు జరగొచ్చు. కొన్నిసార్లు శిక్ష మాత్రమే పడొచ్చు. లైంగిక దాడిలో ఒక వేళ బాలుడు పాల్గొంటే అతడికి జునైవల్ హోంలో ఉంచుతారు. మూడేళ్ల వరకు ఉంచి తరువాత వదిలేస్తారు. ఇలా చట్టంలో ఎన్నో ఉన్నా వాటిని తూచ తప్పకుండా పాటించే వారే కరువయ్యారు. దీంతో ఆడవారి రక్షణ అనుమానాస్పదంగా మారుతోంది.
Also Read: Raghunanadan Rao: గ్యాంగ్ రేప్ ఘటన ఫొటోలు, వీడియోలు రఘునందన్ కు ఎలా చేరాయి?
నిర్భయ కేసులో ఓ బాలుడు ఉండటంతో అతడిని మూడేళ్లు జైలులో ఉంచారు. అనంతరం విడుదల చేశారు. మిగతావారిని మాత్రం ఉరితీశారు ఇలా మన దేశంలో చట్టాలు ఉన్నా వాటిని అమలు చేసే యంత్రాంగమే సరైన విధంగా లేకపోవడం దారుణం. దీంతోనే నేరస్తులు నేరాలు చేస్తూ సులభంగా తప్పించుకుంటున్నారు. లాయర్లకు బాగా డబ్బులు ఇచ్చి పలు సెక్షన్ల కింద తమకు అనుకూలంగా చేసుకుని దర్జాగా బయటకు వస్తున్నారు.

దీంతో నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ఏ మూల చూసినా ఏదో ఒక నేరమే జరుగుతోంది. దీని నుంచి బయట పడేందుకు సహకరించే లాయర్లు ఉన్నంత కాలం కేసులు ఇలాగే కొనసాగుతాయి. చట్టాలు ఎన్ని ఉన్నా వాటిని అమలు చేసే పటిష్ట యంత్రాంగం కరువవడంతో నేరాలు చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. కబ్జాలు, హత్యలు, మానభంగాలు తదితర నేరాలు ఇంకా ఎక్కువవుతున్నాయి. మనిషిలో మంచితనం కనిపించడం లేదు. రాక్షసత్వమే రాజ్యమేలుతోంది. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. శిక్షలు మాత్రం పడటం లేదు.
Also Read:Singer KK: సింగర్ కాకముందు కేకే ఎలాంటి పనులు చేసేవాడో తెలుసా?
[…] Also Read: Punishment For Rape: మైనర్లపై అత్యాచారాలు.. దేశంలో… […]