Mahesh Babu- Allu Arjun: హీరో అల్లు అర్జున్ మహేష్ బాబుని పొగుడుతూ ట్వీట్ చేశారు. మేజర్ మూవీ నిర్మించిన మహేష్ గారికి నా స్పెషల్ రెస్పెక్ట్ అంటూ కామెంట్ చేశారు. మొదటిసారి మహేష్ కి సంబంధించిన చిత్రంపై అల్లు అర్జున్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ ఇద్దరు హీరోల మధ్య మనస్పర్థలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. కారణం 2020 సంక్రాంతి బరిలో దిగిన వీరిద్దరూ థియేటర్స్ విషయంలో గొడవ పడ్డారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురంలో విడుదల కావాల్సి ఉంది. ఒక్క రోజు వ్యవధిలో విడుదల నేపథ్యంలో థియేటర్స్ కేటాయింపు గొడవకు దారి తీసింది.

రేపు విడుదల అనగా జనవరి 10న దిల్ రాజు నేతృత్వంలో ఇరు చిత్రాల నిర్మాతలు కూర్చొని వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. విడుదల తర్వాత కలెక్షన్స్ పోస్టర్స్ తో బాహాబాహీ యుద్ధానికి దిగారు. ఒకరికి మించిన పోస్టర్స్ తో మరొకరు విరుచుకుపడ్డారు. అప్పటి నుండి మహేష్ అల్లు అర్జున్ మధ్య గ్యాప్ నడుస్తుందనే పుకార్లు ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి.
Also Read: Chiranjeevi- Meher Ramesh: ఆలోచనలో పడ్డ చిరంజీవి.. మెహర్ రమేష్ కి షాక్?
అయితే మహేష్ మాత్రం ఇవి పట్టించుకోరు. ఆయన పుష్ప మూవీ అద్భుతం అంటూ ట్వీట్ చేశారు కూడా. ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట మూవీపై అల్లు అర్జున్ స్పందించలేదు. ఆ మాటకొస్తే ఏ హీరో ఈ మూవీని ప్రోమోట్ చేస్తూ ట్వీట్ చేయలేదు. అనూహ్యంగా నేడు అల్లు అర్జున్ మహేష్ నిర్మాతగా ఉన్న మేజర్ మూవీని పొగుడుతూ ట్వీట్ చేశారు. హీరో అడివి శేష్, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల , దర్శకుడు శశికిరణ్ తిక్కా పై ప్రశంసలు కురిపించారు. అలాగే మేజర్ చిత్ర నిర్మాతగా ఉన్న మహేష్ గారికి స్పెషల్ రెస్పెక్ట్. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించినందుకు అన్నారు.

మహేష్ ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ ఇలా కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మధ్య మెగా హీరోల ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మధ్య వివాదం నడిచింది. అల్లు అర్జున్ మెగా హీరో కాదంటూ ఓ తీర్మానం చేసిన నేపథ్యంలో ”ఏం పీకలేరు బ్రదర్” అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మహేష్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతుగా నిలిచారు. అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ క్షమాపణలు చెప్పడంతో ఆ గొడవ సద్దుమణిగింది.
Also Read:Singer KK: సింగర్ కాకముందు కేకే ఎలాంటి పనులు చేసేవాడో తెలుసా?



[…] […]