Tarakaratna NTR: నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని టాలీవుడ్ లో కొనసాగిస్తున్న హీరోల్లో బాలకృష్ణ.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లే. ఇక కొంతలో కొంత కళ్యాణ్ రామ్ కూడా హీరోగా ఫర్వాలేదనిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో బలమైన హీరోలు బాలయ్య, జూనియర్ లే ముందున్నారు.

నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ను తొలుత దూరంగా పెట్టారని.. అతడిని కుటుంబంలో కలవనీయలేదన్న ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు మాత్రం కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ లు ఒక్కతోడ బుట్టిన అన్నాదమ్ముళ్లలాగానే కలిసి జీవిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాలను కళ్యాణ్ రామ్ నిర్మిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ 2001లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘స్టూడెంట్ నంబర్ 1 ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే జూనియర్ కు పోటీగా నాడు మరో నందమూరి హీరో తారకరత్న ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయారు.కానీ అవేవీ హిట్ కొట్టకపోవడంతో తెరమరుగు అయ్యారు. ఎన్టీఆర్ కు పోటీగానే తారకరత్న సినిమాల్లోకి వచ్చారని అప్పట్లో అందరూ చెవులు కొరుక్కున్నారు.
ఇదే ప్రశ్నను తాజాగా తారకరత్నను అడిగేశారు సినీ విలేకరులు. ఆయన నటించిన ‘9 అవర్స్’ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు రాగా ఈ హాట్ ప్రశ్నను తారకరత్నకు సంధించారు. దానికి ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
Also Read: Prabhas Sister: ప్రభాస్ చెల్లికి చేదు అనుభవం.. సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్
జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా తాను ఇండస్ట్రీలోకి వచ్చానన్నది అవాస్తవాలేనని తారకరత్న స్పష్టం చేశారు. తమ్ముడు ఎన్టీఆర్ 2001లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆయన తర్వాతే నేను పరిశ్రమలోకి వచ్చాను. ఆసమయంలో అందరూ ఎన్టీఆర్ కు పోటీగానే తారకరత్న సినిమాల్లోకి తీసుకు వచ్చారని అనుకున్నారు. కానీ అందులో నిజం లేదు. నేను ఎప్పుడూ పోటీ అనుకోలేదు’ అని తారకరత్న క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయాన్ని తాను అప్పటి నుంచే క్లియర్ చేద్దామనుకున్నానని.. కుదరలేదని.. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సమయానికే తమ్ముడు ఎన్టీఆర్ ‘ఆది’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని తారకరత్న చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తారక్ పెద్ద నటుడు అని.. మేమంతా నందమూరి బిడ్డలమేనని.. ఈరోజుకీ మా ఫ్యామిలీ అలా అభిమానుల్లో నిలబడి ఉందంటే దానికి తారక్ కూడా కారణం అని తారకరత్న పొగిడేశాడు.
తమ్ముడు ఎన్టీఆర్ కు, నాకు మధ్య మంచి అనుబంధం ఉందని.. మేం అప్పుడప్పుడూ కలుస్తూ సరదాగా జోక్స్ కూడా వేసుకుంటామని తారకరత్న వివరించారు.
Also Read: Raghunanadan Rao: గ్యాంగ్ రేప్ ఘటన ఫొటోలు, వీడియోలు రఘునందన్ కు ఎలా చేరాయి?



[…] […]