Ramulamma: ఓ రేంజులో కేసీఆర్ ను టార్గెట్ చేసిన రాములమ్మ..!

  హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గడిచిన ఏడేళ్లుగా తెలంగాణలో దూసుకెళుతున్న కారు స్పీడుకు బీజేపీ బ్రేకులు వేస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ క్రమంగా బలపడుతూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ ఆ తర్వాత ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ ముందుకెళుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకిచ్చిన బీజేపీ హుజూరాబాద్ లోనూ అదే సీన్ ను రిపీట్ చేసింది. సీఎం కేసీఆర్ అత్యంత […]

Written By: NARESH, Updated On : November 8, 2021 3:56 pm
Follow us on

 

ramulamma

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గడిచిన ఏడేళ్లుగా తెలంగాణలో దూసుకెళుతున్న కారు స్పీడుకు బీజేపీ బ్రేకులు వేస్తోంది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ క్రమంగా బలపడుతూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ ఆ తర్వాత ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ ముందుకెళుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకిచ్చిన బీజేపీ హుజూరాబాద్ లోనూ అదే సీన్ ను రిపీట్ చేసింది.

సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ రెండో స్థానానికే పరిమితమైంది. హుజూరాబాద్ కాషాయ జెండా రెపరెపలాడటంతో గులాబీ బాస్ ఫ్రస్టేషన్స్ కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీపై ఒంటికాలితో లేచారు. దాదాపు గంటపాటు సాగిన ఈ ప్రెస్ మీట్లో కేవలం బీజేపీ నాయకులపై ఆయన తన అసహనాన్ని వెళ్లగక్కారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ నాయకురాలు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు.

హుజూరాబాద్ ఎఫెక్ట్ తోనే సీఎం కేసీఆర్ ఫౌంహౌజ్ వీడారన్నారు. చాలారోజుల తర్వాత సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టారన్నారు. హుజూరాబాద్లో బీజేపీ గెలువడంతో కేసీఆర్ లో ఫ్రస్టేషన్ పెరిగిపోయి ప్రెస్ మీట్ పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయాలను దోచుకున్న కేసీఆర్ పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని Ramulamma ఫైరయ్యారు. కేసీఆర్ ఒకడి వల్లే తెలంగాణ రాలేదని ప్రజలందరీ భాగస్వామ్యంతోనే స్వరాష్ట్ర కల సాకరమైందని గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్ నోరుతెరెస్తే అన్ని అబద్దాలే మాట్లాడుతారని అన్నారు. మాటతప్పితే పదిసార్లు మెడలు నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ ఎన్నిసార్లు తన మాటను నిలుపుకున్నారని రాములమ్మ విమర్శించారు. మాటమీద నిలబడని కేసీఆర్ బండి సంజయ్ మెడలు విరుస్తానంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ మాయమాటలు నమ్మే రోజులు పోయాయని ఇందుకు హుజూరాబాద్ ప్రజల తీర్పే నిదర్శమని విజయశాంతి స్పష్టం చేశారు.

అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డిజీల్ ధరలు తగ్గించినట్లుగానే తెలంగాణలోనూ ప్రభుత్వం వ్యాట్ ను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. ఉత్తరాది రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెబుతున్న కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడు ఏం చేశారంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మాత్రమే కాదు.. అవినీతి ఎవరూ చేసిన జైలుకు వెళ్లాల్సిందేనని ఆమె రివర్స్ కౌంటర్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మెడలు వంచేలా బీజేపీ ఉద్యమాలు చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.