రైతు చట్టాలు.. రాష్ట్రపతి నోట.. పార్లమెంట్ లోనూ మార్మోగింది

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 ప్రతిపక్ష పార్టీలు బ‌హిష్కరించాయి. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాత్మక ఘటనలు బాధ కలిగించాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఇచ్చిన రాజ్యాంగ చట్టాలు.. నిబంధనలు పాటించాలని చెబుతున్నాయని ఉద్ఘాటించారు. కోవిడ్‌ను సమర్థవంతంగా కట్టడి చేశామని, శాస్త్రవేత్తల […]

Written By: Srinivas, Updated On : January 29, 2021 2:12 pm
Follow us on


పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 ప్రతిపక్ష పార్టీలు బ‌హిష్కరించాయి. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన హింసాత్మక ఘటనలు బాధ కలిగించాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఇచ్చిన రాజ్యాంగ చట్టాలు.. నిబంధనలు పాటించాలని చెబుతున్నాయని ఉద్ఘాటించారు.

కోవిడ్‌ను సమర్థవంతంగా కట్టడి చేశామని, శాస్త్రవేత్తల కృషి ఆత్మ నిర్భర్ భారత్‌లో ఎంఎస్ఎంఈల పాత్ర ఎంతో కీలకమైంది. రూ.20 వేల కోట్ల ప్రత్యేక నిధి, ఫండ్ ఆఫ్ ఫండ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు మేలు జరిగిందని రాష్ట్రపతి చెప్పుకొచ్చారు. దేశంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందజేసే కార్యక్రమం వేగంగా సాగుతోందని అన్నారు. ‘దేశ రైతుల ప్రయోజనాల కోసమే కొత్త సాగు చట్టాలను తీసుకొచ్చాం.. నూతన సాగు చట్టాలు రైతుల హక్కులకు భంగం కలిగించబోవని అన్నారు. సాగు చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు.. హక్కులు లభిస్తాయి. వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. బాపూజీ కలలు గన్న స్వరాజ్యం సాధించడం మా ప్రభుత్వ ప్రధాన ధ్వేయం.. దేశంలోని 24 వేల ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ సేవలను ఎక్కడ నుంచైనా పొందొచ్చు.. జన ఔషధి కార్యక్రమంలో భాగంగా పేదలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందజేస్తున్నాం’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Also Read: రాజ్‌దీప్ పై వేటు..: రెండు వారాలు స్క్రీన్‌ పైకి రాకూడదని ఆదేశం

‘చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వరకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నేట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర నది ఆధారంగా జలమార్గాలు అభివృద్ధి.. జమ్మూలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం. నగరాల్లో పేదల కోసం 40 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. పలు నగరాల్లో మెట్రో సేవలను విస్తరించాం.. బోడో ప్రాదేశిక ప్రాంత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం సంతోషదాయకమని’ అభిప్రాయపడ్డారు.

పరిశ్రమల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని.. పశువుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పశుధన్‌ పథకం ప్రతి ఏడాది 8.2 శాతం వృద్ధి సాధిస్తోందని.. గ్రామీణులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నామని.. దేశంలో కొత్తగా 22 ఎయిమ్స్‌లకు ఆమోదం తెలిపామని.. దీనితో దేశ ఆరోగ్య వ్యవస్థను తమ ప్రభుత్వం మరింత బలోపేతం చేశామని వెల్లడించారు.

Also Read: అయోధ్య మసీదులో నమాజ్ చేసినా పాపమే.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

‘కరోనాపై భారత పోరాటం స్ఫూర్తిదాయకం. పూర్తశక్తి సామర్థ్యాలతో వైరస్‌ను ఎదుర్కొంది. సమయానుకూల నిర్ణయాలతో మహమ్మారిని సమర్థంగా కట్టడి చేసింది. లక్షల మంది పౌరుల ప్రాణాలు కాపాడేలా ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టడం సంతృప్తినిచ్చింది’ అని చెప్పారు.

గతేడాది జూన్‌లో భారత్‌–చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది జవాన్లు అమరులయ్యారు. దేశరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరవీరులకు ప్రతి పౌరుడు రుణపడి ఉంటాడు. దేశ సౌభ్రాతృత్వాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇందుకోసం సరిహద్దుల్లో ప్రభుత్వం అదనపు బలగాలను ఏర్పాటు చేసింది అని చెప్పారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

అంత‌కుముందు పార్లమెంటు ప్రాంగ‌ణంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశానికి సంబంధించి ఈ దశాబ్దం చాలా కీలకమైందని, భార‌త‌ స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు ఇది మంచి అవ‌కాశ‌మ‌ని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విషయాలపైనే చర్చలు జరగాలన్నారు. దేశ‌ చరిత్రలో గ‌తేడాది తొలిసారిగా నిర్మలా సీతారామన్ నాలుగైదు మినీ బడ్జెట్లను వివిధ ప్యాకేజీల రూపంలో సమర్పించాల్సి వచ్చిందని చెప్పారు.