Homeఎంటర్టైన్మెంట్రివ్యూ : '30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా' - బోరింగ్ లవ్ డ్రామా !

రివ్యూ : ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ – బోరింగ్ లవ్ డ్రామా !

30 Rojullo Preminchadam Ela Telugu Review
’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో సినిమాతో ప్ర‌దీప్ మాచిరాజు హీరోగా ప‌రిచ‌యం అవుతూ వచ్చిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌దీప్ స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టించారు. కాగా మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ప్రేయసిని చూపించిన రాజమౌళి

కథ :

1945లో ప్ర‌దీప్ – అక్షర ఒకర్ని ఒక్కరూ సిన్సియర్ గా ప్రేమించుకుంటారు. అయితే ఒకరి పై మరొకరు అపార్ధం చేసుకుని ఆ జన్మలో విడిపోతారు. మళ్ళీ ఈ జన్మలో ప్ర‌దీప్, అర్జున్ గా అమృతా అయ్య‌ర్ అక్షరగా పుట్టి ఒకే కాలేజీలో చదువుతుంటారు. మొదటి పరిచయంలోనే ఒకర్ని ఒకరు ద్వేషిస్తూ ఉంటారు. వీరిద్దరూ ఒకర్ని ఒకరు ఇష్ట పడపోవడానికి గత జన్మలో వీరి మధ్య జరిగిన కథ కారణం అవుతుంది. దాని కారణంగా ఈ జన్మలో వీరి మధ్య జరిగిన డ్రామా ఏమిటి అనేది మెయిన్ కథ. ఇక చివరకు వీరిద్దరూ మళ్ళీ ఎలా కలిశారు ? ఈ మధ్యలో ఎలాంటి సమస్యలు ఎదురుకున్నారు ? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:

నూతన దర్శకుడు మున్నా ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మెస్మరైజ్ చేయకపోయినా ఇప్పటికే వచ్చిన కథను ఎమోషనల్ గా చెప్పడానికి ప్రయత్నం చేసినా.. అది ఆకట్టుకోలేదు. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో మున్నా దర్శకుడిగా పర్వాలేదనిపిస్తాడు. ఇక హీరోగా నటించిన ప్రదీప్ తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా ఆకట్టుకోవడానికి బాగానే తాపత్రయ పడ్డాడు. అయితే అతని పాత్ర ఇంకా బలంగా ఉంటే అతనికి ప్లస్ అయ్యేది. ‌ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమృతా అయ్య‌ర్ తన నటనతో పాటు గ్లామర్ తోనూ బాగా ఆకట్టుకుంది. ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో అమృతా అయ్య‌ర్ మెప్పించింది. హీరోకి ఫ్రెండ్ గా నటించిన కమెడియన్ హర్షా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం సినిమాకి ప్లస్ అయింది.

Also Read: ఆగస్టు నెలలో శర్వానంద్ ‘మహా సముద్రం’

సినిమాలో ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ఉంది కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను మాత్రం లేవు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి బలమైన కారణాలు ఎలా లేవో.. వారి మధ్య దూరం పెరగడానికి, వారి మధ్య కాన్ ఫ్లిక్ట్ పెరగడానికి కూడా సరైన కారణాలు పెద్దగా కనిపించవు. ఇక హీరోయిన్ మనోగతం కూడా ఆమె పాత్ర బలహీనతను స్పష్టంగా తెలియజేస్తోంది. పైగా సినిమాలో ఎక్కడా బలమైన సంఘర్షణ కూడా లేదు. దీనికి తోడు ఉన్న ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు. డైరెక్టర్ స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా లవ్ డ్రామాలను లైక్ చేసే వారికైనా రీచ్ అయ్యేది

ప్లస్ పాయింట్స్:

కాన్సెప్ట్,
కామెడీ సీన్స్
నటీనటులు నటన

మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే,
మాటలు,
సెకెండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్
రొటీన్ ట్విస్ట్ లు, అండ్ క్లైమాక్స్
రొటీన్ డైరెక్షన్.
ఎలాంటి కొత్తదనం లేకపోవడం.

తీర్పు :

రొటీన్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ లవ్ డ్రామాలో కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నా… అక్కడక్కడ కొన్ని దృశ్యాలు పాత సినిమాలను గుర్తుకుచేయడం, అలాగే బోరింగ్ ట్రీట్మెంట్, బ్యాడ్ డైరెక్షన్ సినిమాని చంపేశాయి. ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు. పైగా థియేటర్ లో చూసే సినిమా కూడా కాదు ఇది.

రేటింగ్ : 2

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version