ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌లో ఉంది. ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు ఓ అభిమాని సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఆటగాళ్లు అతడికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు రోహిత్, పంత్, గిల్, సైని లంచ్‌కు వెళ్లారు. భారత్‌కు చెందిన నవల్దీప్ సింగ్ మెల్‌బోర్న్‌లో ఉంటున్నాడు. జనవరి 1న అతడు ఓ హోటల్‌కు వెళ్లగా రోహిత్ శర్మ, రిషభ్ పంత్, నవదీప్ సైని, శుభ్‌మన్ గిల్ తన ముందు టేబుల్‌లో కూర్చున్నారు. వారిని చూసి తెగ ఆనందపడిపోయిన నవల్దీప్.. సీక్రెట్‌గా వారి లంచ్ బిల్లు చెల్లించేశాడు.
Also Read: టెస్టుల్లోకి నటరాజన్.. వైస్ కెప్టెన్ గా రోహిత్
ఈ విషయం తెలియక క్రికెటర్లు సైతం తమ బిల్ చెల్లించేందుకు వెళ్లారు. అయితే ‘మీ టేబుల్ వెనుక కూర్చున్న నవల్‌దీప్ సింగ్ అనే వ్యక్తి బిల్లును కట్టేశార’ని హోటల్ సిబ్బంది చెప్పారు. దీంతో మన క్రికెటర్లు సర్‌ప్రైజ్ అయ్యారు. తాము బిల్ కడతామని, వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ..ఇందుకు నవల్దీప్ ఒప్పుకోలేదు. అది తన గిఫ్ట్ లాగా చూడండని కోరాడు. దీంతో భారత ఆటగాళ్లు కూడా అతడిని హగ్ చేసుకుని కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు.
Also Read: రోహిత్ ఇన్.. విహారీ ఔట్..!
దీనిపై నవల్దీప్ సింగ్ స్పందిస్తూ.. ‘నేను బిల్లును చెల్లించినట్లు వాళ్లకి తెలియదు. నా సూపర్‌స్టార్స్ కోసం ఆ మాత్రం చేయలేనా!’ అని ట్వీట్ చేశాడు. దాన్ని రీట్వీట్ చేస్తూ..‘బిల్లు కట్టానని తెలుసుకున్న రోహిత్ నా వద్దకు వచ్చి.. ‘బ్రదర్.. డబ్బులు తీసుకో. మీరు చెల్లించడం బాగోద’ని అన్నాడు. ఆ తర్వాత పంత్ హగ్ చేసుకున్నాడు. అందరం కలిసి ఓ ఫొటో తీసుకున్నాం’ అని పోస్ట్ చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో భారత్, ఆసిస్ చెరొకటి గెలిచి సమ ఉజ్జీలుగా నిలిచాయి. ఇక సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ 7వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. అలాగే రోహిత్ ఇటీవలే క్వారంటైన్ పూర్తి చేసుకుని టీమిండియాతో చేరాడు. మూడో టెస్టులో అతడు కూడా ఆడనున్నాడు.