జాతీయ వార్తలుకాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్న రజినీకాంత్ !

కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్న రజినీకాంత్ !

Rajanikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. రజిని జనవరి 2021లో తన పార్టీ పేరుని ప్రకటిస్తాడని కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా రజినీకాంత్ పార్టీ పెట్టాలని ఫిక్స్ అయ్యాక… పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ.. గురువుల సూచనలను వింటూ చాలా ప్లాన్డ్ గా రజిని రాజకీయాల్లోకి రాబోతున్నాడు. కాగా తాజాగా బెంగుళూర్ లో నివాసం ఉండే తన అన్నయ్య సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు రజినీకాంత్. తానూ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా.. అన్నయ్య ముందు చాలా చిన్నపిల్లాడిలానే రజిని ఉంటాడట.

Also Read: భారత్ బంద్ కేవలం నాలుగు గంటలేనటా..!

ఏ పని చేసిన తన అన్నయ్యకు చెప్పకుండా చేయడట. నిజానికి రజినీకాంత్ కి అన్నయ్య ఉన్నట్లే చాలామందికి తెలియదు. కానీ రజిని తన అన్నయ్యను తండ్రిగా భావిస్తాడట. అలాగే కమల్ హాసన్ సహా కోలీవుడ్ లోని తన స్నేహితులను కూడా రజినీకాంత్ కలిసి వారి మద్దతు, దీవెనలు కోరుతాడని తెలుస్తోంది. రాజకీయాల్లోకి రజిని లేట్ గా వచ్చినా.. అందరినీ కలుపుకునిపోవాలని ఆశ పడుతున్నట్లు ఉన్నాడు. నిజానికి మొదట రజినీకాంత్… రాజకీయ పార్టీ విషయంలో ఊగిసలాడాడు. కానీ అన్ని ఆలోచించుకున్న తర్వాత ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయం తీసుకుని.. దానికి తగ్గట్లుగా ముందుకు వస్తున్నాడు.

Also Read: అనూహ్యం పరిణామం: రజినీకాంత్-కమల్ హాసన్ కలుస్తున్నారా?

అసలు రజినీకాంత్ రాజకీయాలోకి రావాలని 1990లలోనే అనుకున్నాడని.. కాకపోతే అప్పటి సినిమాల బిజీలో రజినికి టైం కుదరలేదట. కానీ తన మద్దతును మాత్రం రజిని బాహాటంగానే ప్రకటించాడు. ముఖ్యంగా జయలలితకి ఓటేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని 20 ఏళ్ల క్రితం రజినీకాంత్ అన్న మాటకు ఆమె పార్టీ ఘోరంగా ఓడింది అప్పట్లో. ఆ లెవల్లో రజినీకాంత్ కి అప్పుడు ఫాలోవింగ్, ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఆ రేంజ్ ఇమేజ్ ఉందా అంటే.. అనుమానమే.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Jailer 2: జైలర్ 2 మూవీ లో రజినీకాంత్ ను అస్సలు తట్టుకోలేమట…

Jailer 2: రజినీకాంత్ హీరోగా నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన 'జైలర్ 2' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. గత మూడు సంవత్సరాల క్రితం వచ్చిన 'జైలర్' సినిమా ఏ...

Rajinikanth Jailer 2: రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే చూడటం కష్టమేనట…

Rajinikanth Jailer 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ఏ సినిమా కూడా పాన్ ఇండియాలో తమ సత్తా చాటలేక పోతుంది. ఇప్పటివరకు స్టార్ హీరోలు ఎన్ని సినిమాలు చేసినా...

Most Popular

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...

BJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP:  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా పాలనా అధికారం కోసం పోటీపడే ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన మెట్టు. ఈ రాష్ట్రం 80 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే అత్యధిక...
Exit mobile version