Mohan Babu: ఒకప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. కెరియర్ మొదట్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన ఆ తర్వాత హీరోగా మారి సూపర్ హిట్ సినిమాలను చేశాడు. ఒకానొక సందర్భంలో మోహన్ బాబు కి వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో రజనీకాంత్ సలహా మేరకు ‘పెదరాయుడు’ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. పెదరాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మోహన్ బాబు దగ్గర డబ్బులైతే అంత ఎక్కువగా లేవట. ఇక ప్రొడ్యూసర్ కూడా తనే కావడం వల్ల ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు రజినీకాంత్ కి ఆ విజయం తెలిసిందట.
దాంతో తనే స్వయంగా హైదరాబాద్ వచ్చి మోహన్ బాబుని కలిసి అతనికి 45 లక్షల రూపాయలను ఇచ్చారట. నీ దగ్గర డబ్బులు లేవని అర్థమైంది. ప్రస్తుతానికైతే ఈ డబ్బులతో సినిమా చేసేయ్ మూవీ సక్సెస్ అయిన తర్వాత నాకు ఇచ్చేయి అని ఆయన చెప్పారట.
మొత్తానికైతే మోహన్ బాబుకి అంత మంచి సపోర్ట్ ఇచ్చిన వారు ఎవరు ఇండస్ట్రీలో లేరంటు ఆయన ఒక సందర్భంలో చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. మోహన్ బాబు లాంటి నటుడిని ఎంకరేజ్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు. కానీ అతను ప్లాపుల్లో ఉన్నప్పుడు తనకు డబ్బులు ఇచ్చి మరి ఒక సినిమాని రీమేక్ చేయమని చెప్పి, ఆ మూవీ రీమేక్ రైట్స్ కూడా రజినీకాంత్ ఇచ్చాడు.
అలాగే ఆ మూవీలో యాక్టింగ్ చేసి మరి ఆ సినిమా సక్సెస్ సాధించడానికి కీలకపాత్ర వహించిన రజనీకాంత్ కి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్లిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒకరికి ఒకరు అరేయ్ అనుకునే అంత చనువు ఉంది. దాంతోనే వీళ్ళిద్దరు ఎప్పటికప్పుడు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు…

