భయం తగ్గింది బాధ్యత పెరగాలి:ఈటెల

కరోనా వైరస్ పై భయం తొలగి పోయినా, ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. మల్లాపూర్ డివిజన్ ఎస్ వి నగర్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ రాష్టాలకు పనులకై వెళ్లి, ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటుతో తిరిగి మన రాష్టానికి వచ్చిన […]

Written By: Neelambaram, Updated On : May 23, 2020 2:43 pm
Follow us on

కరోనా వైరస్ పై భయం తొలగి పోయినా, ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. మల్లాపూర్ డివిజన్ ఎస్ వి నగర్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ రాష్టాలకు పనులకై వెళ్లి, ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటుతో తిరిగి మన రాష్టానికి వచ్చిన వారితో అనేక మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. దేశంలో  లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణయే అని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని వైరస్ భారి నుండి కాపాడుకున్నాము. ముంబై, ధానే, పూనా నగరాలలో నెలకొన్న పరిస్థితులను అర్ధం చేసుకోండి.. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి… మాకేమి అవుతుందులే అనే నిర్లక్ష్యం వద్దు… మీ కుటుంబం, మీతోటి వారు, సమాజం గురించి ఆలోచించండి అని చెప్పారు.

బస్తీ దవాఖానలలో పైసా ఖర్చు లేకుండా వైద్య సేవలు అందుతాయని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవలను పెంచనున్నట్లు తెలిపారు. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు బస్తీ దవాఖానలు తెరిచి వుంటాయని తెలిపారు. కార్పొరేటర్లు, కాలనీ వాసులు  బస్తీ దవాఖానాల నిర్వహణలో భాగస్వాములు కావాలని మంత్రి తెలిపారు.