‘గులాబీ చట్టంలో కుటుంబ పాలన’

తెలంగాణ రాష్ట్రంలో గులాబీ చట్టంలో కుటుంబపాలన కొనసాగుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ కు హుందాతనం లేదన్న విషయం ప్రపంచానికి తెలుసని ఎద్దేవా చేశారు. అందుకే తమ నాయకుల జోలికి వస్తున్నారని విమర్శించారు. గులాబీ చట్టంలో జాతీయ సంపదైన ఖనిజ వనరులను కార్పొరేట్ పరిశ్రమలు దుర్వినియోగం చేస్తున్నాయని అరవింద్ ఆరోపించారు. మైహోమ్‌, శ్రీజయ జ్యోతి సిమెంట్ మధ్య సంబంధాలు ఉన్నాయని అరవింద్ అన్నారు. 2008 నుంచి 2019 […]

Written By: Neelambaram, Updated On : May 23, 2020 2:02 pm
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో గులాబీ చట్టంలో కుటుంబపాలన కొనసాగుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ కు హుందాతనం లేదన్న విషయం ప్రపంచానికి తెలుసని ఎద్దేవా చేశారు. అందుకే తమ నాయకుల జోలికి వస్తున్నారని విమర్శించారు.

గులాబీ చట్టంలో జాతీయ సంపదైన ఖనిజ వనరులను కార్పొరేట్ పరిశ్రమలు దుర్వినియోగం చేస్తున్నాయని అరవింద్ ఆరోపించారు. మైహోమ్‌, శ్రీజయ జ్యోతి సిమెంట్ మధ్య సంబంధాలు ఉన్నాయని అరవింద్ అన్నారు.

2008 నుంచి 2019 వరకు విదేశీ పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయన్నారు. మైనింగ్ సవరణ చట్టం ఉల్లంఘన, బెదిరింపులు, ట్రాన్స్ఫర్లు, జాతీయ సంపదను ఇతర దేశాలకు తరలించడం వంటి అక్రమాలకు మైహోమ్ పాల్పడిందన్న ఆయన… వేల కోట్ల జాతీయ సంపదను అడ్డంగా దోచుకుందన్నారు. మేళ్లచరువు(నల్గొండ) దగ్గర 300ఎకరాలు కేటాయింపులు జరిగిందన్నారు. ఇందులో 79 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో 2011 ఫిబ్రవరిలో  113  ఎకరాలకు పైగా భూదాన్ భూమిలో 20ఏళ్ల నుంచి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గాయత్రి గ్రానైట్ రవి చంద్రకి 2017లో 10కోట్ల పెనాల్టీ వేయడంతో ఆయన టీఆర్ఎస్‌ లో చేరారు. దీంతో ఆయనకు పెనాల్టీ మాఫీ చేశారు. తెలంగాణలో గులాబీ చట్టం నడుస్తుందని, ఈ అక్రమాలు మీద సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తనకు రామేశ్వర్ రావుతో వ్యక్తిగత కక్ష లేదని, ఆయన తన తండ్రి లాంటి వారన్నారు. అక్రమ మైనింగ్ వల్ల దేశానికి 4లక్షల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందన్నారు.