https://oktelugu.com/

22న బలపరీక్ష.. ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయం

ఎడారి రాజకీయాలు చివరికి చేరుకున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న సంక్షోభం చివరకు ప్రభుత్వానికి ఎసరు తెచ్చేలా మారుతోంది. డిప్యూటి సీఎం సచిన్ పైలట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తుండని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించిన సంగతి తెల్సిందే. సచిన్ పైలట్ తన మద్దతుదారులతో బీజేపీకి వెళుతున్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం సచిన్ పైలట్, అతడి మద్దతుదారులను పదవుల నుంచి తొలగించి షాకిచ్చింది. Also Read: జమిలి ఎన్నికలతో మునిగేది చంద్రబాబేనా? కాంగ్రెస్ పార్టీలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 20, 2020 / 09:49 PM IST
    Follow us on


    ఎడారి రాజకీయాలు చివరికి చేరుకున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న సంక్షోభం చివరకు ప్రభుత్వానికి ఎసరు తెచ్చేలా మారుతోంది. డిప్యూటి సీఎం సచిన్ పైలట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తుండని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించిన సంగతి తెల్సిందే. సచిన్ పైలట్ తన మద్దతుదారులతో బీజేపీకి వెళుతున్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం సచిన్ పైలట్, అతడి మద్దతుదారులను పదవుల నుంచి తొలగించి షాకిచ్చింది.

    Also Read: జమిలి ఎన్నికలతో మునిగేది చంద్రబాబేనా?

    కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. సచిన్ పైలట్, అతడి మద్దతుదారులు బీజేపీ వస్తే స్వాగతిస్తామంటూ ఇప్పటికే ఆపార్టీకి చెందిన నేతలు బహిరంగగానే ఆహ్వానం పలికారు. మరోవైపు సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ నేతలు సవాల్ విసిరారు. ఈనేపథ్యంలోనే రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.

    మరోవైపు సీఎం గెహ్లాట్ తనకు స్పష్టమైన మెజార్టీ ఉందని చెబుతూ ఈనెల 22న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్నాడు. 200మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సచిన్ పైలాట్ తిరుగుబాటుతో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడింది. వీరిలో స్పీకర్ 19మందికి అనర్హత నోటీసులు ఇచ్చారు. అయితే తనకు 109మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం గెహ్లాగ్ గవర్నర్ ను కలిసి విన్నవించడం ఆసక్తికరంగా మారింది.

    Also Read: కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం స్పెషల్ ఫోకస్..!

    కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇద్దరు భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండాలనే షరతుతో గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు బీటీపీ పార్టీ అధ్యక్షుడు, ఇతర ఎమ్మెల్యేలు రాజ్‌కుమార్ రోయత్, రామ్ ప్రసాద్ ప్రకటించారు. అదేవిధంగా తిరుగుబాటు చేసిన నేతలు సైతం అధిష్టానం సూచనలతో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 22న బలనిరూపణకు సిద్ధమవుతున్న గెహ్లాట్ కు పైలట్ వర్గం షాకిచ్చేందుకు రెడీ అవుతుందనే టాక్ విన్పిస్తుంది. అయితే రాజస్థాన్ రాజకీయాలు చివరంకానికి చేరడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.