https://oktelugu.com/

మహేశ్‌ మెచ్చిన మూవీ రీమేక్‌లో విశ్వక్‌సేన్!

‘వెళ్లపోమాకే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన హీరో విశ్వక్‌సేన్. ఫస్ట్‌ మూవీనే దిల్‌ రాజు బ్యానర్లో చేశాడు. కానీ, ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ, తరుణ్‌ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు విశ్వక్. ఆపై, స్వీయ దర్శకత్వంలో ‘ఫలక్‌నుమా దాస్‌’తో ప్రేక్షకుల మందుకొచ్చాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఫ్యాన్‌ ను మెప్పించాడు. కానీ, ఆ మూవీ అనేక వివాదాలు సృష్టించింది. అలాగే, వివిధ వేదికలపై కొన్ని కాంట్రవర్సీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 20, 2020 / 10:10 PM IST
    Follow us on


    ‘వెళ్లపోమాకే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన హీరో విశ్వక్‌సేన్. ఫస్ట్‌ మూవీనే దిల్‌ రాజు బ్యానర్లో చేశాడు. కానీ, ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ, తరుణ్‌ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు విశ్వక్. ఆపై, స్వీయ దర్శకత్వంలో ‘ఫలక్‌నుమా దాస్‌’తో ప్రేక్షకుల మందుకొచ్చాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఫ్యాన్‌ ను మెప్పించాడు. కానీ, ఆ మూవీ అనేక వివాదాలు సృష్టించింది. అలాగే, వివిధ వేదికలపై కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్‌ చేసిన విశ్వక్‌పై రెబల్‌ ముద్ర పడింది. అయితే, యూత్‌ ఆడియన్స్‌ మెచ్చే సినిమాలతో ముందుకెళ్తున్న అతను ఈ మధ్యే ‘హిట్‌’తో మంచి హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘పాగల్’ అనే మూవీ చేస్తున్నాడు.

    Also Read:ట్రైలర్కూ పైసలు వసూలు చేస్తున్న ఆర్జీవీ

    దాని తర్వాత విశ్వక్‌ ‘ఓ మై కడవులే’ అనే తమిళ్‌ సూపర్ హిట్‌ మూవీ తెలుగు రీమేక్‌ చేస్తాడని తెలుస్తోంది. అశోక్‌ సెల్వన్‌, గురు ఫేమ్‌ రితికా సింగ్‌ హీరో, హీరోయిన్లు తెరకెక్కిన ఈ ఫాంటసీ రొమాంటిక్‌ కామెడీ మూవీ తమిళ్‌లో మంచి విజయం సాధించింది. రీసెంట్‌గా ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ఫిదా అయ్యాడు. ‘ఓ మై కడవులే చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశా. మూవీలో అందరి పెర్ఫార్మెన్స్‌ సూపర్‌. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు అద్భుతంగా రాసి, బ్రిలియంట్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో అశోక్‌ చాలా సహజంగా కనిపించారు’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. చిత్ర బృందం కూడా మహేశ్‌కు థ్యాంక్స్‌ చెప్పింది.ఈ మూవీ తెలుగు రైట్స్‌ నిర్మాత పీవీపీ కొనుగోలు చేశారని, హీరోగా విశ్వక్‌ అయితే బాగుంటుందని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్ డైలాగ్స్‌ రాస్తే బాగుటుందని పీవీపీకి విశ్వక్‌ సూచించాడు. పీవీపీ కూడా సరే అనడంతో తరుణ్ ఆ పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మరోవైపు మలయాళ హిట్‌ మూవీ ‘కప్పేలా’ తెలుగు రీమేక్‌లో కూడా విశ్వక్‌ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి..