https://oktelugu.com/

టెస్టింగ్ కిట్స్ విషయంలో ఇంత నిర్లక్ష్యమా..?

కరోనా టెస్టింగ్ కిట్స్ ని సప్లై చేయడంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న ఒకవైపు ఉంటే అంతే మొత్తంలో అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమౌతోంది. కరోనా టెస్టింగ్ కిట్స్ కొరతతో నగరంలో పలుచోట్ల టెస్టులు నిలిచాయి. కిట్స్ లేకపోవడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులు టెస్టింగులు నిలిపివేశారు. దీంతో టెస్టుల కోసం వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే కరోనాతో బెంబేలెత్తుతుంటే… కిట్స్ కొరత మరింత ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. […]

Written By: , Updated On : July 20, 2020 / 09:37 PM IST
Follow us on

Corona Testing kits

కరోనా టెస్టింగ్ కిట్స్ ని సప్లై చేయడంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న ఒకవైపు ఉంటే అంతే మొత్తంలో అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమౌతోంది. కరోనా టెస్టింగ్ కిట్స్ కొరతతో నగరంలో పలుచోట్ల టెస్టులు నిలిచాయి. కిట్స్ లేకపోవడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులు టెస్టింగులు నిలిపివేశారు. దీంతో టెస్టుల కోసం వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే కరోనాతో బెంబేలెత్తుతుంటే… కిట్స్ కొరత మరింత ఇబ్బందికరంగా మారిందని వాపోయారు.

దీనిపై అధికారులను మీడియా ప్రశ్నించగా.. శనివారం వరకు కరోనా ర్యాపిడ్ కిట్స్‌ తో 610 టెస్టులు నిర్వహించామని తెలిపారు. అయితే ఈరోజు ర్యాపిడ్ కిట్స్ లేకపోవడంతో టెస్టులు నిలిపివేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో టెస్టులకోసం వచ్చి వారు వెనుదిరుగుతున్నారు. మరోవైపు కొన్నిచోట్ల బోనాలు సెలవు కారణంగా టెస్టులు జరప లేదు. టెస్ట్ కోసం వచ్చిన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.