https://oktelugu.com/

రేపటితో తేలనున్న రజనీ రాజకీయ భవితవ్యం..?

తమిళనాడు రాష్ట్రంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు నాటకీయంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నటుడు రజనీకాంత్ ఈసారైనా రాజకీయాల్లో క్రీయాశీలకంగా వస్తాడా..? లేదా..? అన్న చర్చ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీ ‘రజనీ మక్కల్ మండ్రం’ అనే పార్టీని ప్రారంభించారు. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం సమావేశాలకే పరిమితమైన ఆ పార్టీ ఇతర కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. మరోవైపు రజనీ కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 2:01 pm
    Follow us on

    Rajinikanth

    తమిళనాడు రాష్ట్రంలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు నాటకీయంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నటుడు రజనీకాంత్ ఈసారైనా రాజకీయాల్లో క్రీయాశీలకంగా వస్తాడా..? లేదా..? అన్న చర్చ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీ ‘రజనీ మక్కల్ మండ్రం’ అనే పార్టీని ప్రారంభించారు. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం సమావేశాలకే పరిమితమైన ఆ పార్టీ ఇతర కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. మరోవైపు రజనీ కూడా సినిమాల్లో బీజీగా మారి పార్టీని పెద్దగా పట్టించుకోలేదు.

    Also Read: చంద్రబాబు ఆర్థిక మూలాలు దెబ్బతీసే జగన్ అస్త్రమిదే?

    ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ మంత్రి అమిత్ షా పర్యటించి వెళ్లారు. మొదటి నుంచి అన్నా డీఎంకే మద్దతుతో తమిళనాడులో బీజేపీ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇటీవల ఆయన పర్యటనలో భాగంగా పార్టీ పటిష్టతపై నిర్వహించిన సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట ప్రముఖ నటి ఖుష్భూ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇలా మరికొంత మంది ప్రముఖులను పార్టీలో చేర్చుకుంటే కలిసివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారట. అయితే అమిత్ షా పర్యటన సమయంలో రజనీకాంత్ తో భేటీ అవుతారని ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా మాత్రం ఎక్కడా బయటకు రాలేదు.

    ఇదిలా ఉండగా రేపటి సోమవారం రజనీకాంత్ తన పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసేందుకా..? లేక రాజకీయాల నుంచి తప్పుకోవడానికా..? అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా మొదటి నుంచి బీజేపీకి దగ్గరగా ఉంటున్న రజనీ ఒకవేళ ఆ పార్టీలోకి చేరుతారా..? అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది.

    Also Read: ఎంఐఎం అతిపెద్ద పార్టీగా మారుతుందా..?

    ఒకవేళ రజనీ బీజేపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే కు మద్దతు ఇస్తాడా..? లేదా అనే విషయంపై కూడా అనుమానాలున్నాయి. అయితే అమిత్ షా మాత్రం రజనీని పార్టీలో చేర్చుకునేందుకు ఇంట్రెస్టు చూపుతున్నట్లు తెలుస్తోంది. రజనీ పార్టీలో గనుక చేరితో దక్షిణాదిలో కొంత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఒకవేళ రజనీ బీజేపీలో చేరితే ఎలాంటి కోరిక కోరుతాడోనన్న సస్పన్ష్ కూడా తలెత్తింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్