Homeజాతీయ వార్తలుRahul Gandhi: రాష్ట్రాల హ‌క్కుల‌పై గొంతెత్తిన రాహుల్‌.. ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్న ప్రసంగం..!

Rahul Gandhi: రాష్ట్రాల హ‌క్కుల‌పై గొంతెత్తిన రాహుల్‌.. ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్న ప్రసంగం..!

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మళ్లీ పూర్వ స్థితికి రావాలని, దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. అందుకుగాను తొలుత రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నది. అయితే, ఇందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం కూడా కృషి చేస్తూ, ప్రోత్సాహం ఇస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పార్టీని బలోపేతం చేయడానికిగాను తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన పార్లమెంటు వేదికగా చేసిన ప్రసంగం అత్యద్భుతమని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో రాహుల్ ప్రసంగం తెగ వైరలవుతోంది.

Rahul Gandhi
Rahul Gandhi

రాహుల్ ప్రసంగానికి దేశం ఫిదా అయిందని ఈ సందర్భంగా కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. సూటిగా సుత్తి లేకుండా దేశంలో జరుగుతున్న పరిణామాలను స్పష్టంగా రాహుల్ గాంధీ వివరించారని ఈ సందర్భంగా పేర్కొంటున్నారు పలువురు. కేరళ ఎంపీగా రాహుల్ గాంధీ దక్షిణాది సమస్యల్ని వివరిస్తూనే, కేంద్రం రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్షతను వివరించారు.

కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కుంటూ సమాఖ్య స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తున్నదని, ఆ తీరుపైన సునిశితమైన విమర్శలు చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని, దానిని ‘రాజ్యం’గా పరిపాలించలేమని చెప్పారు. భారతదేశం వివిధ భాషలు, సంస్కృతుల సమ్మేళనం అని, ఫెడరలిజం, వాక్ స్వాతంత్ర్యం, డిబేట్స్ ప్రజాస్వామ్యానికి ముఖ్యమని చెప్పారు. సమాఖ్య వ్యవస్థలో సహకారం అవసరాన్ని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు. అశోకుడు, మౌర్యులు గురించి తెలుసుకోవాలని, వారు మాటలు, చర్చల ద్వారానే రాజ్యాలను పాలించారని గుర్తుచేశారు.

Also Read: మ‌ల్ల‌న్న స్వామి సాక్షిగా మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. ఆల‌య ఖాతా మీద పెత్త‌నం కోసం వ‌ర్గ‌పోరు..!

కేంద్ర ప్రభుత్వానికి చరిత్రపై అవగాహన లేదని, రాష్ట్రాల యూనియన్ అనే భావనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. చర్చల ద్వారానే నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ ఈ సందర్భంగా సూచించారు. కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్ఠ ద్వారా పాలన చేస్తున్నదని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలనూ ఒప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలో రెండు ఇండియాలు ఉన్నాయని రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదల ఇండియా, ధనవంతుల ఇండియా అని ప్రస్తుతం రెండు ఇండియాలు ఉన్నాయని విమర్శించారు. ఈ రెండు ఇండియాల మధ్య అంతరం అంతకంతకు పెరిగిపోతున్నదని, బీజేపీ పాలనలో 23 కోట్ల మంది మళ్లీ పేదరికంలోకి వెళ్లిపోయారని రాహుల్ స్పష్టం చేశారు. మొత్తంగా రాహుల్ గాంధీ ప్రసంగం చాలా ఆసక్తికరంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

Also Read: కేసీఆర్ స్వాగ‌తం ప‌ల‌కడం మోడీకి ఇష్టం లేదా.. అస‌లు కార‌ణం ఇదే..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] Lata Mangeshkar: భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేరు. కరోనా బారిన పడిన ఆమె నేడు తుది శ్వాస విడిచి అశేష అభిమానులను కన్నీళ్ల లోకంలోకి నెట్టేశారు. తన 13 సంవత్సరాల వయస్సులో గాయనిగా కెరీర్ ను మొదలు పెట్టిన ఆమె 1942లో తన మొదటి పాటను రికార్డ్ చేశారు. ఆ రోజు నుంచి ఏడు దశాబ్దాల పాటు తన గాత్రంతో అలరించారు. […]

  2. […] Revanth Reddy: టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకున్నారు. ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా టీఆర్ఎస్ ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. ఏ వ్యూహం చేప‌ట్టినా గ‌జ్వేల్ ను ఎంచుకోవ‌డంతో రేవంత్ రెడ్డి కేసీఆర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని నేరుగా చూస్తున్నారు. దీని కోస‌మే గ‌తంలో కూడా ఇక్క‌డే ర‌చ్చ‌బండ నిర్వ‌హించాల‌ని చూసినా అది సాధ్యం కాలేదు. దీంతోనే ఆయ‌న ప్రస్తుతం కూడా గ‌జ్వేల్ కే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular