Cinema Viral : సినిమా వైరల్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత కోసం ఓ వీడియో షేర్ చేసింది. షూటింగ్‌లో కీర్తి సురేష్ ఓ చిన్నారిని ‘పెద్దయ్యాక నువ్వు ఏం అవుతావ్’ అని అడగ్గా.. అందుకు ఆ చిన్నారి.. ‘చమంత అవుతా హా’..! అంటూ ముద్దుగా బదులిచ్చింది. ఈ వీడియోను కీర్తి షేర్ చేస్తూ.. ‘సమంత..! ఈమె మీ అభిమాని. ఒకసారి కలుసుకోవాలి సామ్’ అని పోస్టు పెట్టింది. కీర్తి పోస్ట్‌కి సమాధానమిస్తూ.. ‘ఈ క్యూటీ ఎవరు’? అని సమంత అడిగింది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. యువ నటి సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నాడంటూ గతకొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరు తరచూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతుంటారు. తాజాగా బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ డేట్‌కి వెళ్లివస్తుండగా వీరు కెమెరాల కంటపడ్డారు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుండగా సబా తన ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు మరోసారి గుప్పుమన్నాయి.

అలాగే మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. తెలుగులో బిగ్‌బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈనెల 27 నుంచి ప్రసారం కానున్నట్లు సమాచారం. ఈనెల రెండో వారంలో ఈ షో లోగో, ప్రోమో విడుదల కానున్నాయట. ఈ సీజన్‌లో యాంకర్లు వర్షిణి, శివ, ఢీ10 విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఫేమ్ వైష్ణవితోపాటు గత సీజన్‌లలో పాల్గొన్న ముమైత్, ఆదర్శ్, తనీశ్, ధన్‌రాజ్ కూడా పార్టిసిపేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
