కరోనా సెకండ్ వేవ్ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడమే కాకుండా రాజకీయ పరిణామాల్ని కూడా మారుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులతో పాటు మరణాలు ఎక్కువగా ఉన్న భారతదేశాన్ని కరోనా నుంచి కాపాడకపోవడంపై ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు, రాజకీయ విశ్లేషకులు ఇది కచ్చితంగా ప్రభుత్వ విఫలమేనని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ముందస్తుగా పటిష్ట చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. కొన్ని మీడియా సంస్థలు కరోనా సెకండ్ వేవ్ లో భారత ప్రధాన మంత్రి మోదీ గ్రాప్ పూర్తిగా తగ్గిపోయిందిని కూడా కథనాలు రాశారు.
ఈ నేపథ్యంలో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఈ పరిస్థితిని వాడుకుంటే బెటరని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్లోని సీనియర్ నాయకులంతా కలిసి రాహుల్ గ్రాఫ్ పెంచేలా ప్లాన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా కరోనా తగ్గిన వెంటనే రాహుల్ తో ఓ యాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ యాత్రకు ‘రాజీవ్ భరోసా యాత్ర’ అనే పేరు పెట్టారు. ఈ బ్రాండ్ మీద రాహుల్ దేశమంతా తిరిగి మోదీ తప్పులను ప్రజలకు వివరించేలా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం.
ఇంతకంటే ముందు రాహుల్ జనాల్లో కలిసిపోయే వివిధ కార్యక్రమాలు చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనని ప్రచారం చేయనున్నారు. అంతేకాకుండా ధరల పెరుగుతున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయాన్నికూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. గత నెలలో జరిగిన ఎన్నికల్లో, ముఖ్యంగా బెంగాల్ పై ఆశలు పెట్టుకు బీజేపీ అంచనాలు తారుమారయ్యాయి. మరోవైపు ప్రస్తుతం కరోనా విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
అయితే కరోనా ఉధృతి తగ్గిన తరువాత ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నింటి మద్దతు కూడగట్టుకొని యాత్ర చేపట్టేందుకు రెడీ అవుతున్నారట. పలు రాష్ట్రాల్లో పాదయాత్రలతో ఎందరో నేతలు అధికారంలోకి వచ్చారు. దీంతో యాత్ర చేపట్టడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం కలిగించవచ్చనే భావనను తీసుకు రానున్నారట. ఇప్పటికైనా రాహుల్ జాతకం మారుతుందో..? లేదో..? చూడాలి..?