టాలీవుడ్ లో నాగార్జున సాహ‌సం!

థియేట‌ర్ లో సినిమా అంటే వ‌చ్చిన‌ప్పుడే చూడాలి. టీవీలో సినిమా కూడా వేసిన‌ప్పుడే చూడాలి. ఇలాకాకుండా.. మిగిలిన స‌మ‌యంలో చూడాలంటే.. ఓటీటీలో ఉంటే చూస్తాం. అక్క‌డా లేక‌పోతే..? యూట్యూబ్ లోనో.. ఏదైనా సైట్లోనో వెతుకుతాం. కానీ.. ఇక్కడ కూడా అన్ని సినిమాలు దొరికే ఛాన్స్ లేదు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వచ్చిన సినిమాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ అన్ని సినిమాలూ దొరికే అవకాశం తక్కువ. అందుకే.. ఈ ప‌రిస్థిని మార్చేసే సాహ‌స కార్య‌క్ర‌మానికి […]

Written By: NARESH, Updated On : May 21, 2021 2:43 pm
Follow us on

థియేట‌ర్ లో సినిమా అంటే వ‌చ్చిన‌ప్పుడే చూడాలి. టీవీలో సినిమా కూడా వేసిన‌ప్పుడే చూడాలి. ఇలాకాకుండా.. మిగిలిన స‌మ‌యంలో చూడాలంటే.. ఓటీటీలో ఉంటే చూస్తాం. అక్క‌డా లేక‌పోతే..? యూట్యూబ్ లోనో.. ఏదైనా సైట్లోనో వెతుకుతాం. కానీ.. ఇక్కడ కూడా అన్ని సినిమాలు దొరికే ఛాన్స్ లేదు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వచ్చిన సినిమాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ అన్ని సినిమాలూ దొరికే అవకాశం తక్కువ. అందుకే.. ఈ ప‌రిస్థిని మార్చేసే సాహ‌స కార్య‌క్ర‌మానికి సిద్ధ‌మ‌వుతున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున‌.

ఇందులో భాగంగా.. ఓ మూవీ మ్యూజియం ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు నాగ్‌. తెలుగు సినిమా పుట్టిన ద‌గ్గ‌ర్నుంచి టాలీవుడ్లో వ‌చ్చిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల‌ను భ‌ద్ర‌ప‌రిచే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు. ఆ చిత్రాల‌కు సంబంధించిన మొత్తం స‌మాచారం అందుబాటులో ఉండేవిధంగా.. డిజిట‌ల్ మ్యూజియం ఏర్పాటు చేయ‌బోతున్నారు.

నిజానికి.. ఇప్ప‌టికి జ‌నాల‌కు ఏ విష‌యం కావాల‌న్నా ఆన్ లైన్లో ప‌డిపోతున్నారు. స‌మాచారం కావొచ్చు.. వీడియోలు కావొచ్చు.. ఏదైనా ఇంటర్నెట్ పైనే ఆధార‌ప‌డుతున్నారు. రాబోయే కాలంలో ఈ ప‌రిస్థితి మ‌రింత ఎక్కువ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. అందుకే.. తెలుగు సినిమా డిజిట‌ల్ లైబ్ర‌రీని ఏర్పాటు చేయాల‌ని ఆశ‌ప‌డుతున్నారు కింగ్‌.

ఇదే త‌న డ్రీమ్ ప్రాజెక్టు అని చెబుతున్నారు నాగార్జున‌. ముందుగా త‌న తండ్రి న‌ట‌సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన చిత్రాల సేక‌ర‌ణ‌తోనే ఈ కార్య‌క్ర‌మం మొద‌లు పెట్ట‌నున్నార‌ట‌. ఆ విధంగా.. తెలుగులో వ‌చ్చిన అద్భుత‌మైన ప్ర‌తీ చిత్రాన్ని అంద‌రికీ అందుబాటులో ఉంచాల‌ని చూస్తున్నార‌ట‌.

కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ప్ర‌య‌త్నం ఇండియాలో ఏ ఇండ‌స్ట్రీలోనూ జ‌ర‌గ‌కపోవ‌డం విశేషం. నాగ్ గ‌న‌క ఈ ప్రాజెక్టును స‌క్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తే.. ఇదే మొట్ట‌మొద‌టి మూవీ లైబ్ర‌రీ అవుతుంది. అంతేకాకుండా.. తాము కోరుకున్న అపురూప తెలుగు చిత్రాలను ఇబ్బందిప‌డ‌కుండానే ప్రేక్ష‌కులు వీక్షించే వెసులుబాటు రానుంది.